
ఇటీవలే వరల్డ్ ఆఫ్ స్ట్రాటజీ తమ ట్విట్టర్ నుంచి ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన నటుల జాబితాను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ జాబితాలో కళాకారుల మొత్తం సంపాదన గణాంకాల తో తెలియజేయడం జరిగింది. ఈ జాబితాలో జెర్రీ సీన్ ఫెల్ట్ ఈయన టీవీ స్టార్ మరియు హాస్యనటుడు. $1 బిలియన్ అంటే సుమారుగా 8300 కోట్లు రూపాయలు ఆస్తి కలిగి ఉన్నారట.
రెండవ స్థానంలో అమెరికన్ సినిమా పరిశ్రమకు చెందిన హాస్యనటుడు స్క్రిప్టు రచయిత టైలర్ పెర్రి ఉన్నారు. ఈయన ఆస్తి కూడ దాదాపుగా వన్ బిలినియర్ ఉన్నదట.
మూడవ స్థానంలో ధనిక నటుడుగా పేరుపొందిన దిరాక్ ఆస్తి విలువ $890 మిలియన్లు కలదు.
ఇక షారుఖ్ ఖాన్ నాలుగవ స్థానంలో ఇండియా నుంచి ఉన్నారు ప్రపంచంలోనే అత్యధిక ధనవంతులైన వారిలో నాలుగవ స్థానంలో షారుక్ ఖాన్ ఉన్నారు ఇతని సంపాదన రూ.7300 కోట్ల రూపాయలు కలిగి ఉన్నది.
ప్రపంచంలోనే అత్యధికంగా 8 మంది నటులు అత్యధిక ధనవంతులుగా ఉన్నవారిలో ఒకరు భారతీయుడు, మరొకరు చైనా నటుడు కాగా మిగిలిన వారందరూ కూడా అమెరికన్ నటులే కావడం గమనార్హం మొత్తానికి బాలీవుడ్లో స్టార్ హీరోగా ఉన్న షారుఖ్ ఖాన్ మాత్రం నాలుగో స్థానం లో ఉండడంతో ఆనందపడుతున్నారు.