స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ హీరో సినిమా ఇండస్ట్రీలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో స్టార్ హీరోల జాబితాలో ముందు వరుసలో నిలిచాడు. తన సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. రీసెంట్ గా ఈ హీరో నటించిన పుష్ప-2 సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా అనంతరం అల్లు అర్జున్ కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఎయిర్పోర్ట్ లో కనిపించి సందడి చేశారు.  


ఎయిర్ పోర్టులో అల్లు అర్జున్ ధరించిన టీ షర్ట్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతుంది. ఈ హీరో ఎలాంటి దుస్తులు ధరించిన, ఎలాంటి కాస్మెటిక్స్ వాడిన అవి సెన్సేషన్ సృష్టిస్తాయి. అంతలా అల్లు అర్జున్ అభిమానులు తాను వేసుకున్న డ్రెస్సులు, వాచీలు ఇలా అన్నిటినీ వైరల్ చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ధరించిన ఓ టీ షర్ట్ చర్చనీయాంశంగా మారింది. అతను అనగనగా ఒక రోజు సినిమాలోని బ్రహ్మానందం ఐకానిక్ మీమ్ టెంప్లేట్ "నెల్లూరి పెద్దారెడ్డి తాలూకా" టెక్స్ట్ ఉన్న టీ షర్టును ధరించాడు.


అయితే ఇది "పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా" అని పవన్ కళ్యాణ్ అభిమానులు చెప్పుకుంటూ తిరుగుతారు. అయితే ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకు కౌంటర్ గానే ధరించినట్లుగా అనేక రకాల వార్తలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య అనేక రకాల గొడవలు జరుగుతున్నాయని ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదంటూ సోషల్ మీడియా మాధ్యమాల్లో అనేక రకాల వార్తలు వస్తున్నాయి.

అంతేకాకుండా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో రామ్ చరణ్ ను ఫాలో చేసినట్లుగా టాక్ నడుస్తోంది. దీంతో ఈ రెండు కుటుంబాల మధ్య ఏదో గొడవలు ఉన్నాయని చెబుతూ ఉంటారు. గత కొన్ని రోజుల క్రితం అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్స్ మధ్య వార్ కూడా కొనసాగింది. సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలపై మెగా కుటుంబం కానీ అల్లు కుటుంబం కానీ ఏదో ఒక క్లారిటీ ఇస్తే కానీ ఇలాంటి వార్తలకు ముగింపు ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: