
సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో హీరోయిన్ సాయి పల్లవి పేరుకి ఎంత ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం గురించి సెపరేట్గా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. హీరోయిన్ సాయి పల్లవి అంటే అందరికీ ఓ ప్రత్యేక అభిమానం . సాయి పల్లవి నటన ..డాన్సింగ్ స్టైల్ ..ఎక్స్ప్రెషన్స్ అన్ని ఆహ్లాదకరంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. మరి ముఖ్యంగా సాయిపల్లవి పెట్టుకున్న లిమిట్స్ అందరికీ బాగా నచ్చేస్తూ ఉంటాయి. అయితే ఇండస్ట్రీలో సాయి పల్లవి తో డబల్ టైం వర్క్ చేసిన రికార్డ్ కేవలం నాగచైతన్య - నాచురల్ స్టార్ నాని మాత్రమే అందుకున్నారు .
నాని ఎంసీఏ చిత్రంలో అదే విధంగా శ్యామ్ సింగరాయ్ చిత్రంలో హీరోయిన్ గా సాయి పల్లవిని చూస్ చేసుకున్నాడు. నాగచైతన్య లవ్ స్టోరీ సినిమాలో అదే విధంగా తండేల్ సినిమాలో సాయి పల్లవితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు . ఇలా సాయి పల్లవి తో డబల్ టైం స్క్రీన్ షేర్ చేసుకున్న ఘనత వీళ్ళిద్దరికీ మాత్రమే దక్కింది . ఇదే న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. ప్రజెంట్ సాయి పల్లవి బాలీవుడ్ ఇండస్ట్రీలో రామాయణం సినిమాతో బిజీగా ఉంది . కోలీవుడ్ లో కూడా రెండు సినిమాలు చేస్తుంది .టాలీవుడ్ లో కొత్త సినిమాలకి కమిట్ అవ్వడానికి ఆలోచిస్తుంది..!