
అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఏజెంట్ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని రీసెంట్ గానే దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తో సాలిడ్ మాస్ యాక్షన్ మూవీ లెనిన్ మొదలు పెట్టాడు .. అఖిల్ నుంచి ఒక గట్టి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న అభిమానుల కి ఈ సినిమా ఒక ఫుల్ మీల్స్ పెట్టే దాని లా కనిపిస్తుంది అని కూడా చెప్పవచ్చు . ఇప్పటి కే లెనిన్ మూవీ షూటింగ్ ఎంతో వేగంగా జరుగుతుండ గా తాజా గా ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి ఓ వార్త ఇప్పుడు బయట కు వచ్చింది .. ఆ వార్త ప్రకారం లెనిన్ మూవీ ఈ ఏడాది చివర్లో విడుదల అవుతున్నట్టు గా టాక్ నడుస్తుంది .
ప్రస్తుతాని కి అయితే వచ్చే నవంబర్ 14 కి ఈ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ఆ డేట్ ని లాక్ చేసినట్టు గా తెలుస్తుంది .. ఇక మరి దీని పై సోషల్ మీడియా లో ఫ్యాన్స్ నుంచి మిక్స్ టాక్ కూడా వినిపిస్తుంది .. ఇలాంటి మాస్ సినిమా ని దసరా కో దీపావళి కో వస్తుంది అనుకుంటే ఎలాంటి పండగలు లేకుండా ఖాళీ టైం లో వస్తుందంటూ వారు డిజప్పాయింట్ అవుతున్నారు . ఇక ఈ సినిమా లో అఖిల్ కు జంట గా స్టార్ బ్యూటీ శ్రీ లీల నటిస్తుండ గా . టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ వారు సంయుక్తం గా నిర్మిస్తున్నారు .. ఈ సినిమా తో అయినా ఈ అక్కినేని హీరో బాక్సాఫీస్ దగ్గర సరైన సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి ..