సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం ఓ మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఇప్పటివరకు మేకర్స్ టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. ఈ మూవీ మహేష్ కెరియర్లో 29 వ మూవీగా రూపొందుతున్న నేపథ్యంలో ఈ సినిమాను SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో మేకర్స్ పూర్తి చేస్తూ వస్తున్నారు. ఈ మూవీ కి విజయేంద్ర ప్రసాద్ కథను అందించగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మలయాళ నటుడు పృథ్వీరన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటిస్తూ ఉండడం ... ఇప్పటివరకు అపజయం అంటూ ఎరగని దర్శకుడు అయినటువంటి రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నిలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్ర ఉన్నట్లు , ఆ పాత్ర ఈ సినిమాకే హైలైట్ గా ఉండే అవకాశాలు ఉన్నట్లు , అంత కీలకమైన పాత్ర కావడంతో అందులో గొప్ప క్రేజ్ ఉన్న నటుడిని తీసుకోవాలి అనే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లు , అందులో భాగంగా ఆ పాత్రలో మలయాళ స్టార్ నటుడు అయినటువంటి చియాన్ విక్రమ్ ను తీసుకోవాలి అనే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లు అందులో భాగంగా మరికొన్ని రోజుల్లోనే విక్రమ్ ను కలిసి ఆ సినిమా కథను , ఆయన పాత్రను వివరించనున్నట్లు అన్ని ఓకే అయితే కనుక ఎస్ ఎస్ ఎం బి 29 లో విక్రమ్ నటించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mb