అనిల్ రావిపూడి మామూలోడు కాదయ్యో.. అసలు సినిమాకి ప్రమోషన్స్ చేయను అంటూ భీష్ముంచుకుని కూర్చున్న నయనతార చేతనే అది కూడా సినిమా స్టార్టింగ్ లోనే ప్రమోషన్స్ చేయించాడు.  వామ్మో అనిల్ రావిపూడి ని తక్కువ అంచనా వేయకూడదు ఇలా రకరకాలుగా వార్తలు వినిపించాయి . అలాగే జనాలు మాట్లాడుకున్నారు . ఇప్పుడు సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ బయటపడింది . అనిల్ రావిపూడి - నయనతార చేత సినిమా ప్రమోషన్స్ చేయించడానికి ఆమె ఒక బిగ్ క్రేజీ కండిషన్ కూడా పెట్టిందట . అది కూడా చిరంజీవితో నటించే సీన్స్ కోసమే .


ప్రజెంట్ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఈ న్యూస్ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అనిల్ రావిపూడి ఎప్పుడు కూడా లిమిట్స్ క్రాస్ చేసి రొమాంటిక్ సీన్స్ రాసుకోరు . ఫ్యామిలీ అంతా చాలా ఎంటర్ టైన్నింగ్గా చాలా ఆహ్లాదకరంగా నవ్వుకునే విధంగా ఉండే సీన్స్ తెరకెక్కిస్తారు. అలాంటి డైలాగ్స్ నే ఉంటాయి. "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా చూసాం గా.. ఎంత చక్కగా రాశాడో ఎంత చక్కగా నవ్వించాడో అందరికి తెలిసిందే.  అయితే ఈ సినిమాలో కూడా అలాంటి సీన్స్ నే రాసుకున్నారట .



కాగా నయనతార కన్నా చిరంజీవి కొంచెం హైలైట్ అయ్యే విధంగా క్యారెక్టర్ రాసుకున్నారట అనిల్ రావిపూడి . సాధారణంగా మెగాస్టార్ అంటే అందరికీ ఒక స్పెషల్ ఇంప్రెషన్ ఉంటుంది. ఆయనను చూసి ఆయన ఇన్స్పిరేషన్ తో ఇండస్ట్రీలోకి వచ్చిన అనిల్ రావిపూడి కూడా మెగాస్టార్ పై కృతజ్ఞతతో ఆయన గురించి కొంచెం హైలెట్గా సీన్స్ రాసుకున్నారట . అయితే నయనతార మాత్రం అస్సలు ఒప్పుకోలేదట . చిరంజీవికి సరి సమానంగా ఉండే రోలే తనకి కావాలి అని అలా తనకి ఆ ఆఫర్ ఇస్తేనే ప్రమోషన్ చేయడానికి ఓకే చేస్తాను అని తెగేసి చెప్పిందట.  ఇదే విషయం చిరంజీవికి కూడా తెలుసు అంటూ టాక్.  అయితే చిరంజీవికి ప్రజెంట్ హీరోయిన్స్ కొరట ఏర్పడింది . ఆ కారణంగానే ఒక స్టెప్ డౌన్ కి వచ్చి చిరంజీవికి ఈక్వల్ గా ఉంటే పోజీషన్ లోనే నయనతార క్యారెక్టర్ ను రాసారట అనిల్ రావిపూడి.  ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ గా వైరల్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: