- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

నందమూరి నట‌సింహ బాలయ్య - బోయపాటి శ్రీను కాంబినేషన్ల వచ్చిన సినిమాలు అన్ని ఒకదాన్ని మించి మరొకటి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇక వీరి కాంబినేషన్లో వచ్చిన మూడో సినిమా అఖండ అద్భుతమైన విజయం సాధించింది. అఖండ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న అఖండ 2 తాండవం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న అప్డేట్ ప్రకారం ఈ సినిమా లో ఓ స్పెషల్ ట్రాక్‌ డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. . ఈ పవర్ఫుల్ రూల్ కోసం దర్శకుడు బోయ‌పాటి శ్రీను సీనియర్ హీరోయిన్ విజయశాంతి ని ఎంపిక చేయాలని ప్లాన్ చేస్తున్నారట. నిప్పురవ్వ సినిమా తర్వాత మళ్లీ బాలయ్య విజయ‌ శాంతి కలిసి తెరమీద కనిపించలేదు. మళ్లీ వీరిద్దరూ కలిసి నటిస్తే అదిరిపోతుందని బోయపాటి భావిస్తున్నారట.


బోయపాటి మాత్రమే కాదు బాలయ్య - విజయశాంతి కలిసి మళ్ళీ ఇన్నేళ్లకు వెండి తెర మీద కనిపిస్తే తెలుగు ప్రేక్షకులకు అంతకుమించిన ఆనందం ఉండదు. ఈ సినిమా మొత్తంలో ఆ స్పెషల్ రోల్‌ హైలెట్ అవుతుందని అంటున్నారు. ఈ సినిమాను 14 ఫ్ల‌స్ రీల్స్‌ బ్యానర్ పై రామ్ ఆచంట - గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తుండగా సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. .


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి.. .

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: