
ఈ వీడియో ఫుల్ యాక్షన్స్ సీన్స్ తో అదరకొట్టేసింది. ఈ వీడియో సినీ లవర్స్ కు బాగా గూస్ బంప్స్ తెప్పించింది . అయితే ఈ సినిమాలో హృతిక్ రోషన్ పాత్ర కన్నా ఎన్టీఆర్ పాత్ర హైలెట్ అవుతుందేమో అని ఆశలు పెట్టుకున్నారు నందమూరి అభిమానులు. అదంతా ఒక్క వీడియోతోనే తుడిచిపెట్టుకుపోయింది . ఎన్టీఆర్ బర్త్డ డే సందర్భంగా రిలీజ్ చేసిన వార్ 2 టీజర్ వీడియోలో ఎన్టీఆర్ కన్నా హృతిక్ రోషన్ నే బాగా హైలైట్ చేస్తూ చూపించాడు అయాన్ ముఖర్జీ అంటూ అంతా మాట్లాడుకున్నారు . కొంతమంది బాలీవుడ్ జనాలు ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ పక్కన ఆనలేకపోయాడు అని..పొట్టోడు .. పిల్ల బచ్చా అంటూ దారుణంగా కామెంట్స్ చేశారు . ఈ రెండు విషయాలు పక్కన పెడితే ఇప్పుడు సోషల్ మీడియాలో వార్ 2 సినిమా లో వీళ్ళిద్దరి పాత్రల కన్నా.. మరొక క్యారెక్టర్ హైలెట్ కాబోతుంది అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి .
ఆమె మరి ఎవరో కాదు కియరా అద్వానీ . ఈ సినిమాలో ఫిమేల్ క్యారెక్టర్ లో కనిపించబోతుంది. కీయరా అద్వాని అంటే బాలీవుడ్ జనాలు పడి చచ్చిపోతారు . తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . అయితే కనిపించిన ఒకే ఒక్క షాట్ లో అందాలు అద్భుతంగా ఆరబోసింది అని.. బ్యాక్ ఫిగర్ టెంప్టింగ్ గా ఉంది అని కీయరా అద్వానీ అందాలు ఈ సినిమాకి బాగా ప్లస్ గా మారబోతున్నాయి అని కుర్రాళ్లు నాటీగా మాట్లాడుకుంటున్నారు . ఇద్దరు బడా స్టార్స్ నటించే సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ అయితే ఆ ఇద్దరు హీరోల గురించి నెగిటివ్గా మాట్లాడుకుంటూ హీరోయిన్ గురించి మాత్రం పాజిటివ్ గా మాట్లాడుకుంటున్నారు జనాలు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మొత్తానికి కీయరా అద్వాని తన అందంతో స్టార్ హీరోలను కూడా వెనక్కి నట్టేసే రేంజ్ లోనే దూసుకుపోతుంది. సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు వార్ 2 సినిమాకి సంబంధించిన టీజర్ లుక్స్ వైరల్ గా మారాయి..!