
టాలీవుడ్ లో ప్రస్తుతం సింగల్ స్క్రీన్ లకు కూడా అద్దెకు బదులు షేర్ ఇవ్వాలంటూ ఎగ్జిబిటర్లు ... థియేటర్ల యజమానులు పెద్ద ఎత్తున ఉద్యమానికి తెరలేపారు. గోదావరి జిల్లాల నుంచి మొదలైన ఈ ఉద్యమం కాస్త ఇప్పుడు ఆంధ్రలో సీడెడ్ మిగిలిన జిల్లాలతో పాటు అటు నైజాం వరకు పాకింది. మల్టీప్లెక్స్ తరహాలోనే ఆదాయాన్ని పంచాలంటూ ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఒప్పందానికి నిర్మాతలు , పంపిణీ ధరలు అంగీకరిస్తే సరే లేకపోతే జూన్ 1 నుంచి ధియేటర్లను మూసి వేస్తాం అంటూ రెండు తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు ఇటీవల హైదరాబాద్ లో సమావేశమై నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే నిర్మాతలు సొమ్ములు చేసుకుంటూ ఎగ్జిబిటర్లను మోసం చేస్తున్నారని ఎగ్జిబిటర్లు ఆరోపిస్తున్నారు. ఇందుకు చాలా ఉదాహరణలు చెబుతున్నారు.
ఒప్పంద పత్రంలో పంపిణీ దారులు , నిర్మాతలు కలిసి తమకు అనుకూలంగా ఉండేలా రెంట్ / పర్సంటేజీ విధానంలో చెల్లింపులు అని రాసుకుంటున్నారట. అవకాశాన్ని బట్టి దాని అర్ధాన్ని మార్చుకుంటున్నారట. ఒక పెద్ద సినిమా విడుదలై 40 లక్షల వసూళ్లు రాబడితే ఎగ్జిబిటర్ కు కేవలం రు. లక్ష ఇస్తున్నారు .. 39 లక్షలు నిర్మాతలు, పంపిణీ దారులు తీసుకుంటున్నారు. అక్కడ అద్దె విధానంలో లెక్కగట్టి చెల్లింపులు చేస్తున్నారు. అదే ఏదైనా చిన్న సినిమా 40,000 రాబడితే మాత్రం 20,000 ఇస్తున్నారు. అదేంటి అని ప్రశ్నిస్తే 50 : 50 రేషియో అంటున్నారు. గతంలో ప్రింట్ సిస్టం ఉన్నప్పుడు ఎగ్జిబిటర్ నష్టపోతే ఆ నష్టపోయిన సొమ్మును కట్టి పంపిణీదారుడు తన ప్రింట్ తీసుకువెళ్లేవాడు. ఇప్పుడు ఆ అవకాశం కూడా ఎగ్జిబిటర్లకు లేకుండా పోయిందన్న ఆవేదన వ్యక్తం అవుతుంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు