టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఇక వివాహమానంతరం రహస్య గర్భవతి అనే విషయాన్ని కూడా అభిమానులతో పంచుకున్నారు కిరణ్. తాజాగా ఈ జంటకు ఒక మగ బిడ్డ జన్మించినట్లుగా మరొకసారి అభిమానులకు గుడ్ న్యూస్ తెలియజేశారు. కిరణ్ అబ్బవరం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో తమ జీవితంలో జరిగిన ఈ అద్భుతమైన క్షణాలను  పంచుకోవడం జరిగింది. ఇక ఈ ఫోటోలో తన కుమారుడి పాదాన్ని ముద్దాడుతూ కనిపిస్తూ ఉన్నాడు కిరణ్ అబ్బవరం.

హనుమాన్ జయంతి శుభాకాంక్షలు "నాకు ఎంతో ఇష్టమైన దేవుడు హనుమంతుడు అంటూ ఆయన జయంతి రోజే మా ఇంటికి కుమారుడు జన్మించారు ఇది చాలా ఆనందాన్ని కలిగిస్తోందంటూ స్వయంగా ఆంజనేయుడు మా ఇంటికి వచ్చినట్టు ఉంది అంటూ ఒక పోస్ట్ ని సైతం షేర్ చేశారు". కిరణ్ అబ్బవరం, రహస్య ఇద్దరు మొదటిసారి రాజా వారు రాణి గారు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకొచ్చారు.


గత ఏడాది వివాహ బంధంతో ఒక్కటి కాగా.. వివాహ  అనంతరం రహస్య సినిమాలకు దూరంగా ఉంది. కిరణబ్బవరం మాత్రం వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నారు. గడిచిన కొన్ని నెలల క్రితం తన భార్య రహస్య బేబి బంప్ ఫోటోలను కూడా కిరణ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇప్పుడు తాజాగా తన కుమారుడు జన్మించిన విషయాలను కూడా తెలియజేస్తూ తన ఆనందాన్ని ఇలా అభిమానులతో పంచుకున్నారు కిరణ్ అబ్బవరం. ఈ విషయం తెలిసిన అభిమానులు, సినీ సెలబ్రిటీలు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. కిరణ్ అబ్బవరం రాయలసీమ ప్రాంతానికి చెందిన అబ్బాయి అయినప్పటికీ కూడా సినీ ఇండస్ట్రీలో  వరుస అవకాశాలను సంపాదించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: