
సీనియర్ హీరోయిన్ మరెవరో కాదు అర్చన .. ఇప్పటి తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ తెలుగు సినిమాల్లో క్లాసికల్సినిమాగా నిలిచిన వాటిలో నిరీక్షణ కూడా ఒకటి .. ఈ క్లాసిక్ హిట్ సినిమా ఎన్నిసార్లు చూసినా ప్రేక్షకులకు అసలు బోరు కొట్టదు .. అలాగే ఈ సినిమాలోని పాటల్ని ఇప్పటికీ అందరు వింటూనే వస్తున్నారు .. ముఖ్యంగా ఈ సినిమాలోని ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదే సాంగ్ ఇప్పటికీ యూట్యూబ్లో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే వస్తుంది .. అయితే ఈ సినిమా తర్వాత చాలా కాలం సినిమాలో నటించలేదు .. ఇక ఇప్పుడు షష్టిపూర్తి అనే సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకు రానుంది .. ఇక ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు ..
ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అర్చన మాట్లాడుతూ .. నిరీక్షణ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది .. నిరీక్షణ సినిమాలో గిరిజన యువతి పాత్రలో ఈమె నటించింది .. ఆ పాత్రలో నటించడం ఎంతో సాహసం అనే చెప్పాలి .. ఇక ఆరోజుల్లో నేను చీర కట్టుకొని బ్లౌజ్ లేకుండా నటిస్తున్నానని తెలిసి అందరూ ఎంతగానో షాక్ అయ్యారు .. ఆ సమయంలో నేను ఆ సినిమా దర్శకుడిని ఎంతగానో నమ్మాను .. ఆయన తెర్కక్కించిన సినిమాల్లో ఎక్కడ అశ్లీలతో ఉండదు ఆయనను పూర్తిగా నమ్మి నేను ఆ సినిమా చేశాను అని అర్చన చెప్పుకొచ్చారు .. అలాగే నిరీక్షణ సినిమాకు బాలు మహేంద్ర దర్శకత్వం వహించగా ఈ సినిమా టాలీవుడ్ లోనే ఎవ్వర్ గ్రీన్ హిట్గా నిలిచింది .