సినీ హీరో కమలహాసన్ ఇటీవలే చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని సృష్టిస్తున్నాయి.. దీనివల్ల తాను నటించిన థగ్ లైఫ్ సినిమా కూడా వివాదంలో చిక్కుకున్నది. కర్ణాటకలో ఈ సినిమాని నిషేధించారు.. తమ హెచ్చరికలు కాదని ఎవరైనా సినిమా ప్రదర్శిస్తే ఖచ్చితంగా థియేటర్లను కాల్చివేస్తామంటూ కన్నడికులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ వివాదం మరింత ముదిరిపోయింది తమ సినిమా విడుదలకు అనుమతులు ఇవ్వాలి అంటూ కమలహాసన్ ఇటీవలే హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. థగ్ లైఫ్ సినిమా విడుదలకు భద్రత కల్పించాలి అంటూ కోర్టు మెట్లు ఎక్కిన కమలహాసన్ కు కోర్టులో ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది.

ఈరోజు హైకోర్టు విచారణలో భాగంగా కమల్ హాసన్ను తీవ్రంగా విమర్శించినట్లు తెలుస్తోంది. మీరు ఏమైనా చరిత్రకారుడా? లేకపోతే భాషా పండితుడా? కన్నడ అనేది తమిళం నుంచి పుట్టిందని ఏవిధంగా ఆధారాలతో మీరు మాట్లాడారు ఇది ప్రజల మనోభావాలను దెబ్బతీశాయి.. కాబట్టి మీరు కచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందే అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది అంటు కోర్టు హెచ్చరికలను జారీ చేసింది.. అంతేకాకుండా కమలహాసన్ న్యాయవాదులకు మధ్యాహ్నం 2:30 నిమిషాల వరకు గడువు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.


మీరు చేసిన మీ వాణిజ్య ప్రయోజనాల కోసమే సినిమా తీశారు. అలాంటిది ఇప్పుడు పోలీసులు రక్షణ కల్పించాలా అంటూ ధర్మాసనం కమలహాసన్ ను ప్రశ్నించింది. అయితే  మీరు చేసిన ఈ ప్రకటన శివరాజ్ కుమార్ కు సమస్యగా తీసుకువచ్చిందని ఈ ప్రకటన మీరు ఖండించలేదు, అంగీకరించలేదు, క్షమాపణ కూడా చెప్పలేదు..300 కోట్ల రూపాయల విలువైన సినిమా అని చెబుతున్నారు.. మరి క్షమాపణ చెప్పండి ఎలాంటి అభ్యంతరం ఉండదు అంటూ కోర్టు కూడా తెలియజేసింది.. మరి దీన్ని బట్టి చూస్తూ ఉంటే కమలహాసన్ క్షమాపణలు చెప్పకుంటే కచ్చితంగా థగ్ లైఫ్ సినిమాకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇప్పటికే చాలా చోట్ల కూడా ఈ సినిమా వివాదాలతోనే కనిపిస్తోంది. మరి కమలహాసన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: