పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఏ ఎం రత్నం నిర్మాణంలో ఇప్పటికే ఖుషి , బంగారం అనే రెండు సినిమాలు వచ్చాయి. వీరి కాంబోలో మొదటిగా వచ్చిన ఖుషి సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత వీరి కాంబోలో వచ్చిన బంగారం సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయిన బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకోలేదు. ఇకపోతే ఓ ఈవెంట్లో భాగంగా ఏ ఏం రత్నం మాట్లాడుతూ ... పవన్ కళ్యాణ్ తో బంగారం సినిమా తర్వాత సినిమా మరో చేయడానికి చాలా కాలం ప్రయత్నించాను. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు.

కానీ అనేక ప్రయత్నాల అనంతరం పవన్ కళ్యాణ్ హీరో గా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు మూవీ ని సెట్ చేశాను. కానీ కొన్ని కారణాల వల్ల క్రిష్ జాగర్లమూడి ఆ సినిమా దర్శకత్వ బాధ్యతల నుండి తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ ఈ మూవీ యొక్క మిగిలిన భాగం షూటింగ్ను పూర్తి చేశాడు అని చెప్పాడు. తాజాగా ఏ ఏం రత్నం ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా మీరు తాజాగా రూపొందించిన హరిహర వీరమల్లు సినిమాకు బిజినెస్ పెద్ద స్థాయిలో జరగడం లేదు అని వార్తలు వస్తున్నాయి అది నిజమైన అనే ప్రశ్న ఎదురయింది. దానికి ఏ ఏం రత్నం సమాధానం ఇస్తూ ... హరిహర వీరమల్లు గొప్ప సినిమా. ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్ మరో రెండు , మూడు రోజుల్లో విడుదల కానుంది.

సినిమా ట్రైలర్ విడుదల అయిన తర్వాత జనాల ఒపీనియన్ మొత్తం మారిపోతుంది. ఆ సినిమా బిజినెస్ అదిరిపోయే రేంజ్ లో జరుగుతుంది. ఒక్క సారి ట్రైలర్ విడుదల అయ్యాక ఆ సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటారు అని ఏ ఏం రత్నం తాజాగా చెప్పుకొచ్చాడు. ఇలా ఏ ఎం రత్నం ఈ సినిమా ట్రైలర్ గురించి గొప్పగా చెప్పడంతో పవన్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: