కన్నప్ప మూవీ రిలీజ్ చేస్తాం అనుకుంటే అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. మొన్నటి వరకు హార్డ్ డిస్క్ మాయమైందని వార్తలు వినిపించాయి. ఇదంతా మర్చిపోతున్న తరుణం లో మళ్లీ బ్రాహ్మణ సంఘాల నుంచి ఒత్తిడి మొదలైంది. వాళ్లు సినిమా ని అడ్డుకుంటామని  హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. మంచు విష్ణు కన్నప్ప మూవీ పై కోటి ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా హిట్ అయితేనే ఆయన కెరియర్ ముందుకు వెళుతుంది. లేదంటే ఆయన పరిస్థితి ఆగమ్య గోచరమే. సినిమా కోసం దాదాపు 200 కోట్ల బడ్జెట్ సొంతంగా పెట్టుకున్నారు. సినిమా ప్రమోషన్స్ కూడా భారీగానే నిర్వహిస్తున్నారు.. 

అలాంటి కన్నప్ప సినిమా లోని కొన్ని పాత్రలు బ్రాహ్మణులను కించపరిచేలా ఉన్నాయని అంటున్నారు. జూన్ 27 వ తేదీన విడుదల కాబోయే కన్నప్ప సినిమా లో తమను కించపరిచే సీన్స్ ఉన్నాయని బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నారు. ఈరోజు కన్నప్ప సినిమా కు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా నిర్వహిస్తున్నారు.   ఈవెంట్ ను తప్పకుండా అడ్డుకుంటామని బ్రాహ్మణ సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. బ్రాహ్మణులను కించపరచడం మంచు మోహన్ బాబు కుటుంబానికి అలవాటుగా మారిందని గతంలో చాలా సినిమాల్లో బ్రాహ్మణులను కించపరిచే పాత్రలు వారు చేశారని చెప్పుకొచ్చారు.

కన్నప్ప సినిమాలో పిలక గిలక పాత్రలేదని ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ పాత్రపై స్పష్టత ఇస్తేనే బాగుంటుందని లేదంటే కోర్టును ఆశ్రయించి సినిమా ను అడ్డుకుంటామని బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షులు శ్రీధర్ హెచ్చరించారు. దీనిపై చిత్ర యూనిట్ వారు ఆలోచన చేయాలని అన్నారు. ప్పటికే చాలా సినిమాల్లో బ్రాహ్మణుల పాత్రలు చేసి డిఫరెంట్ గా చూపించాలని, దీనివల్ల వారికి క్రెడిట్ వస్తుందేమో కానీ, మా మనోభావాలు దెబ్బతింటున్నాయని, అలాంటి పాత్రలు చేయడం మానుకుంటే బాగుంటుందని హెచ్చరించారు.. లేనిపక్షంలో బ్రాహ్మణ సంఘాలంతా ఏకమై మంచు ఫ్యామిలీ సినిమాను అడ్డుకుంటామని చెప్పకనే చెప్పారు. మరి దీనిపై మంచి విష్ణు ఎలాంటి క్లారిటీ ఇస్తారనేది ఈరోజు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: