తమిళ సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన నటులలో సూపర్ స్టార్ రజనీ కాంత్ ఒకరు. రజనీ కాంత్ కు తమిళ్ సినీ పరిశ్రమతో పాటు తెలుగు లో కూడా అదిరిపోయే రేంజ్ గుర్తింపు ఉంది. రజిని నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం రజిని , శంకర్ దర్శకత్వంలో రోబో అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

మూవీ తర్వాత శంకర్ , రజనీ హీరోగా రోబో 2.0 అనే సినిమాని రూపొందించాడు. రోబో సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో రోబో 2.0 మూవీ పై తెలుగు ప్రేక్షకులు అత్యంత భారీ అంచనాలు పెట్టుకున్నారు. దానితో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అద్భుతమైన ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ తమిళ డబ్బింగ్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న మూవీ గా నిలిచింది. ఇకపోతే రజినీ ప్రస్తుతం లోకేష్ కనకరాజు దర్శకత్వంలో కూలీ అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.  ఈ మూవీ ని ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నారు.

మూవీ యొక్క రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను మూవీ యూనిట్ అమ్మి వేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా యొక్క రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులు అత్యంత భారీ ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఇకపోతే రోబో 2.0 తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ను జరుపుకున్న సినిమాగా కూలీ నిలిచినట్లు తెలుస్తోంది. కూలీ మూవీ లో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున విలన్ పాత్రలో నటించాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: