విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను, సుశాంత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో.. 2018లో వచ్చిన యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ఈ నగరానికి ఏమైంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి సురేష్ బాబు నిర్మించిన ఈ సినిమాకి తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది.  అంతేకాదు ఇటీవల రీ రిలీజ్ చేయగా అప్పుడు కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ లభించింది. దీంతో టీం తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ ప్రకటించారు. అటు టైటిల్ తో పాటు స్పెషల్ వీడియోని కూడా విడుదల చేయడం జరిగింది.

తాజాగా ఈ నగరానికి ఏమైంది అనే సినిమాకి సీక్వెల్ గా ' ఈNఈ - రిపీట్' అనే డిఫరెంట్ టైటిల్ ని ఫిక్స్ చేశారు. బ్రో దిస్ ఈజ్ అవర్ వైబ్.. మోస్ట్ ఐకానిక్ కన్యా రాశి గ్యాంగ్ ఇస్ బ్యాక్ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక తాజాగా విడుదల చేసిన ఎమోషన్ పోస్టర్లో గాలిలో బ్రీఫ్ కేసులో బట్టలు, బీరు బాటి, సన్ గ్లాసెస్, ఫ్లైట్ టికెట్ అన్నింటినీ కలిపి ఒక అడ్వెంచర్ టూర్ లా మోషన్ పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఈ సినిమా బృందం బిజీగా ఉన్నట్లు తెలిపింది చిత్ర బృందం.

ముఖ్యంగా ఒక డిఫరెంట్ టైటిల్ ని ఫిక్స్ చేయడమే కాకుండా ఇంగ్లీష్ తెలుగు మిక్స్ చేసి లోగో క్రియేట్ చేశారు మేకర్స్ దీంతో భారీగా హైప్ క్రియేట్ అవుతుంది. ఏలినాటి శని అయిపోయింది కన్యా రాశి టైం వచ్చింది.. అనే ట్యాగ్ లైన్ మరింత ఆసక్తిని పెంచేసింది. ప్రస్తుతం ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ కి సంబంధించిన మోషన్ పోస్టర్ వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: