ఏదైనా ఒక సందర్భంలో అద్భుతమైన క్రేజ్ కలిగిన రెండు సినిమాలు కనుక ఒకే రోజు విడుదల అయినట్లయితే ఆ రెండు సినిమాలలో ఏదో ఒక సినిమాకు కాస్త థియేటర్లు తగ్గే అవకాశం ఉంటుంది. ఇకపోతే రెండు మాస్ కమర్షియల్ సినిమాలు ఒకే రోజు విడుదల అయినట్లయితే మాస్ ఏరియాలో థియేటర్స్ కోసం పెద్ద ఎత్తున పోటీ నెలకొంటూ ఉంటుంది. ఇక క్లాస్ మూవీ రిలీజ్ అయినట్లయితే క్లాస్ సెంటర్లలో ఎక్కువ శాతం థియేటర్ల కోసం పోటీ నెలకొంటూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం ఆగస్టు 14 వ తేదీన జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసిన నటించిన వార్ 2 అనే హిందీ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే తేదీన సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా రూపొందిన కూలీ సినిమా కూడా విడుదల కానుంది.

ఈ రెండు మూవీలపై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దానితో ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా పెద్ద స్థాయి విజయాన్ని అందుకుంటుంది అనేది కూడా జనాల్లో అత్యంత ఆసక్తిగా మారింది. ఇకపోతే వార్ 2 మూవీ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందుతుంది. ఈ జోనర్ సినిమాను ఎక్కువ శాతం మల్టీప్లెక్స్ జనాలు ఇష్టపడుతూ ఉంటారు. ఇండియా వ్యాప్తంగా దాదాపు 30 ప్లస్ ఐమాక్స్ స్క్రీన్ లో ఉన్నట్లు తెలుస్తుంది.

దానితో వార్ 2 మూవీ ని నిర్మించిన యాష్ రాజ్ ఫిలిం సంస్థ వారు భారత దేశంగా ఉన్న మొత్తం 30 ప్లస్ ఐ మాక్స్ స్క్రీన్ లను వార్ 2 సినిమా కోసం రెండు వారాల విండో కోసం రిజర్వ్ చేయడానికి ఒక ప్రత్యేక ఒప్పందంపై సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ వ్యూహాత్మక ఒప్పందం ప్రకారం ఇండియా వ్యాప్తంగా కూలీ సినిమాకు ఒక ఐమాక్స్ స్క్రీన్ కూడా అందుబాటులో ఉండే అవకాశం లేదు అని తెలుస్తుంది. ఒక వేళ ఎవరైనా కూలీ సినిమాను ఐమాక్స్ స్క్రీన్ పై  చూడాలి అనుకున్న ఇండియాలో అది అసలు కుదరదు అని తెలుస్తుంది. ఇకపోతే కూలీ సినిమాలో నాగార్జున కూడా నటించాడు. దానితో ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: