గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటిస్తున్న మూవీ పెద్ది .. ఇప్పటికే ఎలాంటి అంచనాలు క్రియేట్ చేస్తుందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు .. ఇక ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తుండగా పక్క యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రాబోతుంది . అలాగే ఈ సినిమాలో రామ్ చరణ్ పక్క ఊర మాస్ లుక్ లో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు .. ఇప్పటికే ఎంతో వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది .. అలాగే ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఓ కొత్త అప్డేట్ బయటకు వచ్చింది .. ఇక ఈ సినిమాకు సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్ ను జులై 12 నుంచి ఢిల్లీలో మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తుంది .


అలాగే ఈ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు రామ్ చరణ్, జాన్వీల పై కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా తెరకెక్కిస్తారట .. అలాగే వీటితో పాటు ఒకటి రెండు పాట‌లు కూడా ఇక్కడే షూటింగ్ చేయనున్నారు .. ఇక ఈ సినిమాకు సంబంధించి మరో 40 రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది .. ఆగస్టు వరకు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తుంది .. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో దివ్యేందు శర్మ , జగపతిబాబు , శివరాజ్ కుమార్ వంటి తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు .



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు ..

మరింత సమాచారం తెలుసుకోండి: