సినిమా ఇండస్ట్రీ లోకి హీరోల కుమారులు మాత్రమే కాకుండా హీరోయిన్ల కుమార్తెలు కూడా ఎంట్రీ ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్గా అనేక సంవత్సరాల పాటు కెరీర్ను కొనసాగించి ఎంతో మంది టాలీవుడ్ స్టార్ హీరోల సరసన ఆడి పాడి అద్భుతమైన గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో సంపాదించుకున్న వారిలో రాధ ఒకరు. రాధ టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న ఎంతో మంది స్టార్ హీరోల సరసన ఆడి పాడి తన నటనతో, అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. రాధ పెద్ద కుమార్తె అయినటువంటి కార్తిక, నాగ చైతన్య హీరో గా రూపొందిన డెబ్యూ ఫిలిం జోష్ తో వెండి తెరకు పరిచయం అయ్యింది.

మూవీ పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఈమెకు రంగం అనే తమిళ సినిమా ద్వారా మంచి విజయం, మంచి గుర్తింపు దక్కాయి. ఈమె టాలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దమ్ము సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత ఈమె నటించిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. దానితో ఈమెకు అవకాశాలు కూడా  తగ్గాయి. ఇకపోతే రాధ రెండవ కుమార్తె తులసి నాయర్ కూడా సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చింది. తులసి నాయర్ విషయానికి వస్తే ఈమె మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన కడలి అనే సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. 

ఆ తర్వాత ఈమె యాన్ అనే మరో సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈమె నటించిన ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఈ రెండు సినిమాల తర్వాత ఈమె సినిమా ఇండస్ట్రీ కి దూరం అయింది. ఆ తర్వాత పెద్దగా బయట కూడా ఎక్కడ కనిపించలేదు. తాజాగా ఈమె తన అక్క కార్తీక పెళ్లిలో కనిపించింది. ఇక ఈమె ఇప్పుడు కాస్త బొద్దుగా మారింది. సినిమాల్లో నటించిన సమయంతో పోలిస్తే ఈమె ఇప్పుడు గుర్తు పట్టలేకుండా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: