టాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగించిన వారిలో నయనతార ఒకరు. తమిళ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టి అక్కడ మంచి గుర్తింపును సంపాదించుకున్న తర్వాత ఈమె తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా అనేక విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించింది. ఇకపోతే గత కొంత కాలంగా ఈమె ఎక్కువ శాతం తన ఫోకస్ను తమిళ సినీ పరిశ్రమపై పెట్టింది. దానితో ఇప్పటికి కూడా కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. తెలుగులో మాత్రం అప్పుడుప్పుడు సినిమాలు చేస్తూ వస్తుంది.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తోంది. నయనతార, షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందిన జవాన్ అనే మూవీతో హిందీ సినీ పరిశ్రమలోకి కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ఏకంగా 1000 కోట్లకు మించిన కలెక్షన్లను రాబట్టి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీతో నయనతారకు హిందీ సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే చాలా సంవత్సరాల క్రితమే షారుక్ ఖాన్ తో నటించే అవకాశం నయనతార  వచ్చిందట. కానీ ఆ ఆఫర్ ను ఈ బ్యూటీ రిజెక్ట్ చేసిందట. అసలు విషయంలోకి వెళితే... కొన్ని సంవత్సరాల క్రితం షారుఖ్ ఖాన్ "చెన్నై ఎక్స్ప్రెస్" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటించింది. ఈ మూవీలో మొదట దీపికా స్థానంలో నయనతారను హీరోయిన్గా తీసుకోవాలి మేకర్స్ అనుకున్నారట. అందులో భాగంగా ఆమెను కలిసి విషయం కూడా చెప్పారట.

కానీ కొన్ని కారణాల వల్ల ఆ సమయంలో ఆ మూవీని తాను చేయను అని చెప్పిందట. ఆ తర్వాత ఈ మూవీ బృందం దీపికాను హీరోయిన్గా సెలెక్ట్ చేసుకుందట. ఇక ఈ మూవీ ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇలా నయనతార "చెన్నై ఎక్స్ప్రెస్" మూవీని రిజెక్ట్ చేసింది అనే వార్త వైరల్ అవుతూ ఉండడంతో చాలా మంది నయన్ ఆ సమయంలో ఆ సినిమా చేసి ఉండుంటే హిందీలో చాలా సంవత్సరాల క్రితమే అద్భుతమైన క్రేజ్ ను దక్కించుకొని ఉండేది అని అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: