మంచు విష్ణు తాజాగా కన్నప్ప అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ జూన్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి టాక్ వచ్చింది. అయినా కూడా ఈ మూవీ కి మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్లు వచ్చాయి. ఆ తర్వాత కూడా ఈ మూవీ కి మంచి కలెక్షన్లు దక్కుతున్నాయి.

ఇకపోతే కొన్ని రోజుల క్రితం మంచు విష్ణు ఈ సినిమా ఓ టీ టీ డీల్ గురించి మాట్లాడుతూ... ఓ ప్రముఖ ఓ టి టి సంస్థ వారు మా సినిమాకు ఇంత రేటు పెడతాం అని చెప్పారు. అది నాకు నచ్చలేదు. దానితో సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ అవుతే ఎంత ఇస్తారు అని అడిగాను. దానితో ఇంత కలెక్ట్ చేస్తే ఇంతిస్తాము అని వారు చెప్పారు. ఆ ఫిగర్ నాకు నచ్చింది. దానితో సినిమా విడుదల అయ్యి కలెక్షన్స్ ముగిశాక కలుద్దాం అన్నాను అని విష్ణు అన్నాడు. దానితో ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఓ టీ టీ కంప్లీట్ కాలేదు.

ఇకపోతే ఈ సినిమా యొక్క నార్త్ సాటిలైట్ డీల్ మాత్రం తాజాగా క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ హిందీ సాటిలైట్ హక్కులను ఓ ప్రముఖ సంస్థ ఏకంగా 20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఓ తెలుగు సినిమా హిందీ సాటిలైట్ హక్కులు 20 కోట్ల ధరకు అమ్ముడుపోయాయి అంటే అది మామూలు విషయం కాదు అని, ఇది సూపర్ ఆఫర్ అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: