సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన కూలీ సినిమా తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కుల కోసం టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న పెద్ద పెద్ద నిర్మాతలు గత కొంత కాలంగా పెద్ద ఎత్తున పోటీ పడ్డ విషయం మన అందరికీ తెలిసిందే. ఎంతో మంది నిర్మాతలు పెద్ద ఎత్తున పోటీ పడ్డ చివరకు ఈ మూవీ యొక్క రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను ఏసియన్ సునీల్ సొంతం చేసుకున్నారు. ఈయన ఏకంగా కూలీ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను 52 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 52 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను వసూలు చేయవలసి ఉంటుంది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్లకు మించిన గ్రాస్ కలెక్షన్లను వసూలు చేస్తేనే ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ ఫార్ములాnu కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకునే అవకాశం ఉంటుంది. ఈ మూవీకి బ్లాక్ బాస్టర్ టాక్ వస్తేనే ఈ మూవీ 100 కోట్లకి మించిన గ్రాస్ కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసే అవకాశం ఉంటుంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. అందుకు ప్రధాన కారణం ఈ మూవీ ఆగస్టు 14 వ తేదీన విడుదల కానుంది.

ఇదే తేదీన జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 కూడా విడుదల కానుంది. తారక్ కి తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన నటించిన వార్ 2 మూవీ కి కూడా మంచి టాక్ వచ్చినట్లయితే కూలీ మూవీ కి 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ల టార్గెట్ తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్దది అవుతుంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. మరి కూలీ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్లకు మించిన గ్రాస్ కలెక్షన్లను రాబట్టి బ్రేక్ ఈవెన్  ఫార్ములాను కంప్లీట్ చేసుకుంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: