మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి  తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి షాకింగ్ వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే. గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అయితే హీరో ఫోన్ చేసి ఏమైనా అడిగారా అని మాట్లాడి వివాదంలో ఇరుక్కున్నారు. దాంతో మెగా ఫ్యాన్స్ బహిరంగ లేఖ విడుదల చేసి ఇంకోసారి ఇలా మాట్లాడితే బాగోదని వార్నింగ్ ఇవ్వడంతో శిరీష్ రెడ్డి స్పందించి నేను రామ్ చరణ్ ని అవమానించలేదని, మీడియా దాన్ని కాస్త వేరేలా వక్రీకరించింది అని,నావల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు చెబుతున్నాను అంటూ తెలియజేశారు. దిల్ రాజు కూడా దీనిపై స్పందించారు. అయితే ఇది మరవక ముందే మరోసారి దిల్ రాజు వివాదంలో ఇరుక్కున్నారు. మెగా ఫ్యాన్స్ ని గిచ్చిమరీ కెలికారు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.మరి ఇంతకీ దిల్ రాజు రామ్ చరణ్ ని అవమానించేలా ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు చూద్దాం.. 

నితిన్ హీరోగా చేసిన తాజా మూవీ తమ్ముడు.. మరికొద్ది గంటల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది అంటే జూన్ 4న ఈ మూవీ రిలీజ్ అవ్వబోతుంది.అయితే సినిమా విడుదల కి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఓవైపు హీరో హీరోయిన్లతో పాటు మరోవైపు నిర్మాతలు కూడా ప్రమోషన్స్ చేస్తున్నారు. అలా తమ్ముడు సినిమాతో నితిన్ ని గట్టెక్కియ్యాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు కి టాలీవుడ్ హీరోల గురించి చెప్పమని ఒక ప్రశ్న ఎదురైంది. దీంతో దిల్ రాజు అల్లు అర్జున్,మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ అంటూ టాలీవుడ్ హీరోలందరి గురించి చాలా గొప్పగా మాట్లాడారు.అయితే రామ్ చరణ్ వంతు వచ్చేసరికి మాత్రం అలా మాట్లాడకుండా చిరంజీవి సన్ అంటూ చెప్పారు.అయితే ఇందులో తప్పేముందని మీరు అనుకోవచ్చు.

కానీ కొంతమంది సోషల్ మీడియాలో ఉండే జనాలు ఏ చిన్న విషయాన్ని కూడా వదలకుండా ట్రోల్ చేస్తూ ఉంటారు. అలా తాజాగా దిల్ రాజు చిరంజీవి సన్ అని మాట్లాడడాన్ని కూడా నెగిటివ్గా చేస్తున్నారు.. ఆర్ఆర్ఆర్ మూవీ తో గ్లోబల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్ ని ఇంకా తండ్రి చాటు కొడుకే అని నిర్మాత దిల్ రాజు అభిప్రాయమా.. తండ్రి గొప్పవాడైనా కూడా రాంచరణ్ తండ్రి పేరును వాడకుండా ఎదిగాడు. అలాంటి హీరోని పట్టుకొని మీరు ఇంకా తండ్రి నీడలోనే పెరుగుతున్నాడు అనే ఉద్దేశంతో మాట్లాడారా అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇక మరి కొంత మందేమో రాంచరణ్ ఎంత ఎత్తుకు ఎదిగినా అది చిరంజీవి వల్లే అంటూ ఉంటారు. ఎందుకంటే రామ్ చరణ్ కి తండ్రి బ్యాగ్రౌండ్ కూడా యూజ్ అవుతుంది కాబట్టి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: