సినిమా ఇండస్ట్రీలో ఓ హీరో ఫలానా బ్యానర్లో మూవీ చేస్తున్నాడు అంటే ఆ మూవీ పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడే కాంబోస్ కూడా ఉన్నాయి. అలాంటి కాంబోలో చిరంజీవి, అశ్విని దత్ కాంబో ఒకటి. చిరంజీవి హీరోగా నటించిన సినిమాలలో నాలుగు మూవీలను అశ్విని దత్ నిర్మించాడు. మొదటగా చిరంజీవి, అశ్వినీ దత్ కాంబోలో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా వచ్చి ఇండస్ట్రీ హిట్ అయింది. ఆ తర్వాత వీరి కాంబోలో వచ్చిన చూడాలని ఉంది సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ఇంద్ర మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఇక ఆఖరుగా వీరి కాంబోలో జై చిరంజీవ సినిమా వచ్చింది. ఈ మూవీ మాత్రం బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇకపోతే చిరంజీవి, అశ్విని దత్ కాంబోలో ఓ మూవీ మిస్ అయింది. ఆ సినిమా కనుక చిరు చేసి ఉండుంటే ఇండియా వ్యాప్తంగా ఆయనకు క్రేజ్ వచ్చేది అని చాలా మంది అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇంతకి చిరు, అశ్విని దత్ కాంబోలో మిస్ అయిన ఆ మూవీ ఏది అనుకుంటున్నారా... అది మరేదో కాదు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ప్లాట్ ఫామ్ లో వెబ్ సిరీస్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. ఇకపోతే మొదట రాజ్ అండ్ డీకే దీనిని వెబ్ సిరీస్ గా కాకుండా సినిమాగా రూపొందించాలి అని అనుకున్నారట.

అందులో భాగంగా అశ్విని దత్ ను కలిసి చిరంజీవి హీరోగా ఈ కథతో సినిమా చేద్దాం అని వారు చెప్పారట. చిరంజీవికి అశ్విని దత్ కథ వినిపించగా ఆయనకు కథ పెద్దగా నచ్చకపోవడంతో ఈ సినిమాలో నటించలేదట. దానితో రాజ్ అండ్ డీకే దీనిని వెబ్ సిరీస్ గా రూపొందించారట. ఇక ఈ వెబ్ సిరీస్ కి ఇండియా వ్యాప్తంగా క్రేజ్ లభించింది. ఈ కథలో చిరంజీవి కనుక నటించినట్లయితే  ఆయనకు ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ వచ్చేది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: