మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు మేకర్స్ టైటిల్ను ఫిక్స్ చేయలేదు. ఈ మూవీ చిరు కెరిర్లో 157 వ మూవీల రూపొందుతూ ఉండటంతో మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ ని పూర్తి చేస్తూ వస్తున్నారు. ఈ సినిమా టైటిల్ను చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ దర్శకుడు అయినటువంటి అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో మెగా 157 మూవీ కి సంబంధించిన అనేక ఆసక్తికరమైన వివరాలను ఆయన తెలియజేశాడు.

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ ... చిరంజీవి తో ప్రస్తుతం నేను చేస్తున్న సినిమా నా కెరియర్ లోనే బెస్ట్ మూవీ అవుతుంది అని నేను ఆశిస్తున్నాను. ఈ మూవీ కామెడీ ప్లస్ ఎమోషనల్ కథాంశం తో రూపొందుతుంది. ఈ మూవీ లో 70% కామెడీ ఉంటే , 30% ఎమోషన్ ఉంటుంది. ఈ మూవీ భార్యా భర్తల అనుబంధం పై ఉంటుంది. అలాగే ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా భాగం కానున్నారు. ఆయన పాత్ర అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది.

ఆయన షూటింగ్లో ఇంకా జాయిన్ కాలేదు. ఆయన షూటింగ్లో జాయిన్ అయిన రోజు బిగ్ బ్లాస్ట్ అప్డేట్ ఉంటుంది అని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. ఇకపోతే చిరు , అనిల్ కాంబోలో రూపొందుతున్న మూవీ లో వెంకటేష్ కూడా నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశం ఉంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: