తెలుగు సినీ పరిశ్రమలో నటుడి గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో శ్రీకాంత్ ఒక రు . ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో కీలక పాత్రల లో , ముఖ్య పాత్ర లలో నటించాడు . అలాగే కొన్ని సినిమాల్లో విలన్ పాత్రలలో కూడా నటించాడు. అలా కెరియర్ తొలినాళ్లలో అనేక పాత్రలలో నటించి నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈయన ఆ తర్వాత సినిమాల్లో హీరోగా అవకాశాలను దక్కించుకొని మంచి విజయాలను అందుకున్నాడు.

ఈయన కెరియర్ ప్రారంభంలో హీరోగా నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం సినిమాలు ఫ్యామిలీ అండ్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీలు ఎక్కువ. వాటితోనే విజయాలను అందుకొని మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇకపోతే శ్రీకాంత్ కెరియర్లో ఒక నటితో భార్య గాను మరియు వదిన గాను నటించాడు. ఇంతకు ఆ నటి ఎవరో తెలుసా ..? ఆమె సౌత్ ఇండస్ట్రీలోనూ అద్భుతమైన క్రేజ్ కలిగిన బ్యూటీ. తెలుగు ఇండస్ట్రీలో అనేక సంవత్సరాల పాటు అద్భుతమైన గుర్తింపు కలిగిన నటిగా కెరియర్ను కొనసాగించింది. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించింది. ఇంతకు ఆమె ఎవరో తెలుసా ..? ఆమె మరెవరో కాదు స్నేహ. 

కొన్ని సంవత్సరాల క్రితం శ్రీకాంత్ , బాపు దర్శకత్వంలో రూపొందిన రాధా గోపాలం  అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో స్నేహ , శ్రీకాంత్ కు భార్య పాత్రలో నటించింది. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం విక్టరీ వెంకటేష్ హీరోగా సంక్రాంతి అనే మూవీ వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో స్నేహ , వెంకటేష్ కి భార్య పాత్రలో నటిస్తే శ్రీకాంత్ , వెంకటేష్ కు తమ్ముడి పాత్రలో నటించాడు. ఇలా శ్రీకాంత్ కి స్నేహ భార్య పాత్రలో వదిన పాత్రలో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: