
సినీ ఇండస్ట్రీలో స్టీరియో టైప్ క్యారెక్టర్ లను చేయడానికి తాను ఎప్పుడు కూడా మొహమాట పడలేదని తన కెరియర్ లో తన క్యారెక్టర్స్ సెలక్షన్ గురించి తాను నటించే పాత్రల గురించి మాట్లాడింది ఐశ్వర్య రాజేష్. వాస్తవానికి ఇమే హీరోయిన్ అయినప్పటికీ కూడా ఈ ఏజ్ లో నలుగురు పిల్లల తల్లిగా నటిస్తే ఆఫర్లు రాకుండా ఉంటాయేమో అని చాలామంది ఇలాంటి పాత్రలు చేయడానికి మక్కువ చూపించరు. కానీ ఐశ్వర్య రాజేష్ మాత్రం ఒప్పుకోవడమే కాకుండా ఆ పాత్రలో ఒదిగిపోయి మరి నటించింది.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా లో ఐశ్వర్య రాజేష్ పాత్ర చాలా కీలకమని చెప్పవచ్చు. యాక్టర్లకు వయసుతో సంబంధం ఉండదని పాత్ర నచ్చితే చేసేయాలని తెలియజేసింది ఐశ్వర్య రాజేష్. మంచి నటిగా పేరు సంపాదించాలి అంటే ఎలాంటి పాత్రలోనైనా సరే నటించాల్సిందే ఇలాంటి క్యారెక్టర్లు చేయడానికి వయసు ఎప్పుడు అడ్డం రాకూడదని అందుకే తాను ఎన్నో సినిమాలలో తల్లిగా నటించానని వెల్లడించింది. సంక్రాంతికి వస్తున్న చిత్రంలో తాను నలుగురు పిల్లలకు తల్లిగా నటించానని ఒకవేళ ఈ చిత్రానికి సీక్వెల్ వచ్చింది అంటే తనకు ఆరుగురు పిల్లలు ఉంటారని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలియజేశారని తెలియజేసింది ఐశ్వర్య రాజేష్. మొత్తానికి ఐశ్వర్య రాజేష్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. మరి సీక్వెల్ ఎప్పుడు వస్తుందో చూడాలి.