"శృతిహాసన్ ".. ఈ పేతుకు కొత్త పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్ . మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ గల హీరోయిన్. ఉన్నది ఉన్నట్లు మాట్లాడే హీరోయిన్.  మన ఇండస్ట్రీలో చాలా తక్కువ మందే అలా ఉంటారు. సినిమా కోసం సినిమాలలో ఆఫర్ కోసం స్టార్స్ భజన ఎక్కువగా చేస్తూ ఉంటారు కొంతమంది హీరోయిన్స్ . కానీ ఆ టైప్ కాదు శృతిహాసన్.  ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తుంది . బహుశా ఆ పోలిక నాన్న దగ్గర నుంచి వచ్చిందేమో అని అంటూ ఉంటారు అభిమానులు .


అయితే రీసెంట్గా స్టార్ బ్యూటీ శృతిహాసన్ అభిమానులకి బిగ్ షాక్ ఇచ్చింది.  ఆమె షాకింగ్ నిర్ణయం తీసుకుంది . కొద్దిరోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నట్లు శృతి తన ఇన్స్టాల్ లో పోస్ట్ చేసింది.  దీంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయిపోయారు. ఏమైంది..?? ఎందుకు సడన్గా ఈ డెసిషన్ తీసుకున్నావ్..?? ఆరోగ్యం బాగోలేదా..?? ఏదైనా నీకు ఇబ్బంది కలిగించే సిచువేషన్ ఉందా ..?? అంటూ రకరకాలుగా ప్రశ్నిస్తున్నారు . శృతిహాసన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది . ఆ విషయం అందరికి తెలిసిందే. మంచి విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది.



మరీ ముఖ్యంగా తనకు సంబంధించిన ఇంపార్టెంట్ విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది . అలాంటి శృతిహాసన్ సడన్గా సోషల్ మీడియాకి దూరం కావాలి అనే నిర్ణయం ఎందుకు తీసుకుంది..?? అనేది ఇప్పుడు బిగ్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే సోషల్ మీడియాలో కొన్ని కొన్ని ఆమెకు సంబంధించిన పిచ్చి వల్గర్ పోస్ట్ లు చూసిన కారణంగానే ఇలా నిర్ణయం తీసుకుంటుంది అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.  కొంతమంది మాత్రం మంచి పని చేస్తున్నావ్  శృతిహాసన్ సోషల్ మీడియా అంటేనే గబ్బు . ఈ సోషల్ మీడియా నుంచి నువ్వు దూరంగా ఉండటమే బెటర్ అంటూ సజెస్ట్ చేస్తున్నారు . ప్రస్తుతం ఈ బ్యూటీ "కూలీ" చిత్రంలో నటిస్తుంది . ఈ సినిమాలో  రజనీకాంత్ హీరోగా నటిస్తూ ఉండగా లోకేష్ కనక రాజు డైరెక్ట్ చేస్తున్నాడు . ఆగస్టు 14వ తేదీ ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: