తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఈయన ఎవరి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ చాలా తక్కువ కాలం లోనే తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. అలా స్టార్ హీరో స్థాయికి ఎదిగిన తర్వాత కూడా ఈయన ఎంతో వినయంతో , విధేయతతో మెలుగుతూ ఎన్నో విజయాలను అందుకుంటు ఇప్పటికి కూడా తెలుగులో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే చాలా సందర్భాలలో సినిమాల విషయంలో , కథల ఎంపికల విషయంలో చిరు డెసిషన్ అద్భుతంగా ఉంటుంది అని అందుకే ఆయన ఎన్నో విజయాలను స్టార్ హీరోగా ఇప్పటికీ కూడా కెరియర్ను కొనసాగిస్తున్నాడు అని అనేక మంది అనేక సందర్భాలలో చెప్పారు.

ఈ మధ్య కాలంలో కూడా చిరంజీవి రిజక్ట్ చేసిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయలను అందుకున్నాయి. కొంత కాలం క్రితం మాస్ మహారాజా రవితేజ "టైగర్ నాగేశ్వరరావు" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని మొదట చిరంజీవి హీరోగా రూపొందించాలి అని మేకర్స్ భావించారట. అందులో భాగంగా చిరంజీవి ని కలిసి కథను కూడా వివరించారట. కానీ చిరంజీవి పలు కారణాలతో ఈ మూవీ కథను రిజక్ట్ చేశారట. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కొంత కాలం క్రితమే సందీప్ కిషన్ హీరోగా రీతు వర్మ హీరోయిన్గా రావు రమేష్నీతూ అంబానీ కీలక పాత్రల్లో మజాకా అనే మూవీ వచ్చిన విషయం మనకు తెలిసిందే.

మూవీ లో మొదట చిరంజీవి ని హీరోగా అనుకున్నారట. కానీ చిరంజీవి మాత్రం ఈ సినిమాలో నటించడానికి ఓకే చెప్పలేదట. కొంత కాలం క్రితం విడుదల అయిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దానితో కథల ఎంపిక విషయంలో చిరంజీవి డెసిషన్ సూపర్ అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: