
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ సినిమా కూలీ. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేస్తుండడంతో సినిమాపై సాలిడ్ బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే అదిరిపోయే రెస్పాన్స్ వస్తుండడంతో ఈ సినిమాను ఎప్పుడు చూద్దామా ? అని అందరూ ఒకటే వెయిటింగ్ చేస్తున్నారు. ఈ సినిమా ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లోను సాలిడ్ అంచనాలతో థియేటర్లలోకి దిగుతోంది. ముఖ్యంగా అమెరికాలో కూలీ సినిమా బిజినెస్ పై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో అక్కడ భారీ స్థాయిలో రేట్లు చెప్పుతున్నారు. అలాగే భారీ స్థాయిలో రిలీజ్ చేసినందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
అమెరికాలో ఈ సినిమాకు సంబంధించి టికెట్ బుకింగ్ జూలై 24 నుంచి ప్రారంభించాను అన్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ లో ఈ సినిమా ట్రెండ్ క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు ధీమాతో ఉన్నారు. ఉపేంద్ర - నాగార్జున - శృతిహాసన్ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. కోలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్ర సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆగస్టు 14 వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా కు పోటీ గా ఎన్టీఆర్ - హృతిక్ వార్ 2 రిలీజ్ అవుతుండడంతో గట్టి పోటీ ఉండనుంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు