హీరోయిన్ త్రిష కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రిలోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు పొందిన కథానాయిక.. త్రిష ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి దాదాపు రెండు దశాబ్దాల ముగిసింది. అయినా ఇప్పటికీ ఏమాత్రం తరగని అందంతో కుర్ర హీరోయిన్స్ కి సినిమాల్లో పోటీ ఇస్తూ దూసుకుపోతోంది. నిజం చెప్పాలంటే త్రిష తో సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన చాలామంది హీరోయిన్లు ఇప్పటికే పెళ్లిళ్లు చేసుకొని పిల్లల్ని కన్నారు. కొంతమంది ఇండస్ట్రీకి దూరమైపోయారు. కానీ త్రిష మాత్రం ఇంకా పాతికేళ్ల పిల్లలాగే రోజురోజుకు తన అందాన్ని పెంచుకుంటుంది. త్రిష కు పెళ్లయితే కాలేదు కానీ ప్రేమ విషయాల్లో అనేక రూమర్స్ ఉన్నాయి.. త్రిష విజయ్ ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారని చాలా సందర్భాల్లో ఫోటోలు,వీడియోలు బయటకు వచ్చాయి. 

అయితే తాజాగా త్రిష మరియు విజయ్ దళపతి ఒకే చోట ఉన్నట్టుగా సోషల్ మీడియాలో ఒక వీడియో లీక్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.. ఆ వీడియోలో ఉన్న వాయిస్ ప్రకారం చూస్తే.. త్రిష తనకు ఉన్నటువంటి కుక్కపిల్లతో ఆడుకుంటున్న సమయంలో ఆ కుక్కని ఎవరో పిలిచినట్టుగా వాయిస్ వినిపిస్తుంది. అంతేకాదు ఆ వాయిస్ కు త్రిష స్పందించి అవతలి వ్యక్తితో ఆనందంగా మాట్లాడుతుంది.. ఈ వాయిస్ నిశితంగా గమనిస్తే అది హీరో దళపతి విజయ్ ది అన్నట్టుగా పలువురు కామెంట్లు పెడుతున్నారు.. అంటే త్రిష విజయ్ దళపతి ఒక దగ్గరే ఒకే ఇంట్లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.

 అంతేకాదు వీరిద్దరూ కలిసి ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు విజయ్ దళపతి పెట్టిన  పివికే పార్టీలో కూడా టీ అంటే త్రిష, వి అంటే విజయ్ దలపతి కే అంటే కీర్తి సురేష్ అంటూ వ్యంగ్యంగా కామెంట్లు పెడుతూ  నెట్టింట్లో నెటిజన్లు వర్ణిస్తున్నారు.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై త్రిష విజయ్ దళపతి ఏ విధంగా స్పందిస్తారో ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: