
త్వరలోనే సీనియర్ హీరోయిన్ రంభ కూడా రీయంట్రి ఇవ్వబోతున్నట్లు సమాచారం. అయితే తెలుగు సినిమాలకు మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు రంభ. మరొక హీరోయిన్ శిల్పా శెట్టి కూడా టాలీవుడ్లో రీ ఎంట్రీ పైన ఆసక్తి చూపిస్తున్నట్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈమెకు మాస్ పాత్రలు కావాలంటూ హింట్ ఇచ్చిందట. మీనా ,జెనీలియా వంటి హీరోయిన్స్ కూడా ఇప్పటికే రీ యంట్రి ఇస్తూ పలు చిత్రాలలో నటిస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలనాటి హీరో జగపతిబాబు కూడా ఎంట్రీ ఇచ్చి విలన్ గా కూడా అద్భుతమైన నటనను ప్రదర్శిస్తున్నారు.
హీరో రాజశేఖర్ కూడా పలు చిత్రాలలో క్యారెక్టర్ రోల్స్ చేయడానికి సిద్ధమవుతున్నారట. అలాగే హీరో సుమన్, సాయికుమార్, వినోద్ కుమార్ వంటి హీరోలు ఇప్పటికే పలు చిత్రాలలో నటిస్తున్నారు. ఇప్పుడు మరొక హీరో తొట్టెంపూడి వేణు కూడా క్యారెక్టర్ రూల్స్ లోకి మారారు. తాజాగా వడ్డే నవీన్ కూడా సినిమాల్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వినిపిస్తున్నాయి. ఈ హీరోనే కాకుండా మరొక హీరో తరుణ్ కూడా రీ యంట్రి ఇవ్వడానికి సిద్ధమవుతున్నారనే విధంగా వినిపిస్తున్నాయి ఇందుకు సంబంధించి ఇటీవలే సోషల్ మీడియాలో ఫోటోలు కూడా వైరల్ గా మారడం జరిగింది.