
కోట శంకర్రావు కూడా తన అన్నయ్య బాటలోనే ఇండస్ట్రీలోకి నటుడుగా ఎంట్రీ ఇచ్చిన పలు రకాల చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా నటించారు. అంతేకాకుండా పలు సీరియల్స్ లో కూడా నటించారట. గత కొన్నేళ్లుగా కోటా శంకర్రావు కూడా పెద్దగా ఎక్కడ కనిపించడం లేదు. సినిమాలలో కూడా అవకాశాలు తగ్గడంతో పాటుగా వయో భారంతో ఆయన కూడా సినిమాలకు దూరమయ్యారని సమాచారం. ఈ రోజున కోట శ్రీనివాసరావు మరణించడంతో ఆయన ఇంటికి వచ్చి మరి కోటా శంకర్రావు అన్ని విషయాలను దగ్గరుండి మరి చూసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చివరిగా తన అన్నయ్య అంత్యక్రియలలో పాల్గొన్న కోట శంకర్రావు సంబంధించి ఫోటోలు వీడియోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.
కోట శంకర్రావు కూడా పలు చిత్రాలను విలన్ గా కూడా నటించారు. ఎందుకో సక్సెస్ కాలేకపోయారు. తాజాగా వైరల్ గా మారిన ఈ ఫోటోలు చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు అచ్చం కోట శ్రీనివాసరావు లాగానే తన తమ్ముడు కనిపిస్తున్నారని.. మరి ఇన్ని రోజులు ఎందుకు బయట కనిపించడం లేదన్నట్టుగా ప్రశ్నిస్తున్నారు. 1972లో ఎర్ర సాక్షి అనే చిత్రం ద్వారా కోట శంకర్రావు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. చివరిగా 2020 ద్రోణ అనే చిత్రంలో నటించారు. ఇవే కాకుండా పలు సీరియల్స్ లో కూడా నటించారు శంకర్రావు