సెల్ ఫోన్స్ సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చేయడంతో నవలలు కథలు చదివే అలవాటు చాలామందికి తగ్గిపోయింది. అయితే దీనికి భిన్నంగా ఒక నవల తమిళనాడులో లక్ష కాపీలు అమ్మకం జరగడం ఒక సంచలనంగా మారింది. ఆ నవల పేరు ‘వేల్పరి’. తమిళనాడు చరిత్రలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ నవలను వ్రాసారు.

అయితే ఈనవలకు విపరీతమైన స్పదన రావడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడ ఈ నవలకు దక్కడంతో ఈనవల పేరు మారుమ్రోగిపోయింది. అనేక భారతీయ భాషలలోకి ఈ నవలను అనువధించారు. ఒకప్పుడు దక్షిణ భారత సినిమా రంగాన్ని దర్శకుడుగా శాసించిన దర్శకుడు శంకర్ ధృష్టి ఈ నవల పై పడింది. ఈ నవలను  భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా 1000 కోట్ల బడ్జెట్ తో తీయాలని శంకర్ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ నవల లక్ష కాపీలు అమ్మకం జరిగిన సందర్భంలో ఏర్పాటు చేసిన ఫంక్షన్ కు అతిధులుగా రజనీకాంత్ దర్శకుడు శంకర్ లు అతిధులుగా హాజరు అయ్యారు. ఈ ఫంక్షన్ లో రజనీకాంత్ మాట్లాడుతూ దర్శకుడు శంకర్ ఈ నవల పై ఏర్పరుచుకున్న కల నెరవేరాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పడమే కాకుండా తాను శంకర్ కోరుకుంటే ఈ నవలా చిత్రంలో తాను నటించాలని ఉంది అంటూ తన కోరికను బయటపెట్టాడు.

దీనితో శంకర్ రజనీకాంత్ ల కాంబినేషన్ లో ఒక భారీ సినిమా త్వరలో వచ్చే అవకాశం ఉంది అన్న సంకేతాలు వస్తున్నప్పటికీ ప్రస్తుతం శంకర్ ను నమ్ముకుని ఏనిర్మాత 1000 కోట్ల పెట్టుబడి ఈ భారీ బడ్జెట్ మూవీ పై పెడతారు అన్న విషయం సమాధానం లేని ప్రశ్న గా మారింది. ‘ఇండియన్ 2’ ‘గేమ్ ఛేంజర్’ లాంటి భారీ ఫ్లాప్ సినిమాలను తీసిన శంకర్ ను నమ్మి ముందుకు వచ్చే నిర్మాత ఎక్కడ ఉన్నాడో చూడాలి. అప్పటివరకు శంకర్ కోరిక తీరే ఆస్కారం కనిపించడం లేదు..      




మరింత సమాచారం తెలుసుకోండి: