ఇప్పుడంటే మోహన్ బాబు నటించిన సినిమాలకు పెద్దగా క్రేజ్ ఉండడం లేదు కానీ కొన్ని సంవత్సరాలు వెనక్కు వెళ్లినట్లయితే మోహన్ బాబు సినిమా విడుదల అవుతుంది అంటే పెద్ద ఎత్తున థియేటర్ల దగ్గర హంగామా ఉండేది. ఆ రేంజ్ లో ఆయన సినిమాలపై క్రేజ్ ఏర్పడడానికి ప్రధాన కారణం ఆయన నటించిన ఎన్నో సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకోవడమే. ఒకా నొక సమయంలో మోహన్ బాబు టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలుగా కెరియర్ను కొనసాగించిన ఎంతో మంది కి గట్టి పోటీని కూడా ఇచ్చాడు. మోహన్ బాబు తన కెరీర్ లో ఎంతో మంది అద్భుతమైన క్రేజ్ కలిగిన నటి మనులతో నటించాడు. మోహన్ బాబు కి జోడిగా నటించిన ఓ ముద్దు గుమ్మ ఇప్పటికి కూడా బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటిగా కెరియర్ను కొనసాగిస్తుంది. ఆమె కేవలం తెలుగు లో నాలుగు సినిమాల్లోనే నటించింది.

బాలకృష్ణ తో ఒక సినిమా , నాగార్జున తో ఒక సినిమా , వెంకటేష్ తో ఒక సినిమా , మోహన్ బాబు తో ఒక సినిమా నటించింది. ఇంతకు ఆ నటిమణి ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు శిల్పా శెట్టి. ఈమె విక్టరీ వెంకటేష్ హీరో గా రూపొందిన సాహస వీరుడు సాగర కన్య అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మోహన్ బాబు హీరో గా రూపొందిన వీడెవడండీ బాబు అనే సినిమాలో శిల్పా శెట్టి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ 1977 వ సంవత్సరం విడుదల అయింది. ఆ తర్వాత ఈ బ్యూటీ నాగార్జున హీరోగా రూపొందిన ఆజాద్ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత శిల్పా శెట్టి , బాలకృష్ణ హీరోగా రూపొందిన భలేవాడివి బాసు మూవీ లో హీరోయిన్గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: