- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

నెల రోజుల గ్యాప్లో మూడు సినిమాలు విడుదల చేయటం అంటే మామూలు విషయం కాదు. మూడు పెద్ద సినిమాలు నెలరోజుల గ్యాప్ లో రిలీజ్ చేస్తూ ఇండస్ట్రీ దృష్టిలో మరింత ఎత్తుకు ఎదిగారు నిర్మాత నాగ వంశీ. సితార బ్యానర్ నిర్మించిన విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా ఈనెల 31న రిలీజ్ అవుతుంది. రవితేజ తో నిర్మించిన మాస్ జాతర వచ్చే నెలాఖరున విడుదల చేస్తున్నారు. మధ్యలో ఆగస్టు 15న ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ వార్ 2ను కూడా పంపిణీ చేస్తున్నారు. అయితే ఇది ఒక రకంగా రిస్కీ గేమ్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. మూడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి అన్న నమ్మకం ఉంటే తప్ప ఇలాంటి గేమ్ ఆడకూడదన్న అభిప్రాయం వినిపిస్తోంది. మూడు సినిమాలకు కలిపి ఎగ్జిబిటర్లు అయితేనే డిస్టిబ్యూటర్లు అయితేనే సితార సంస్థకు కట్టాల్సింది భారీగానే ఉంది. విజయ్ దేవరకొండ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాలలో 35 కోట్ల బయ్యర్ల నుంచి తీసుకోవాలి. అలా తీసుకున్న రెండు వారాలలో వార్ 2 సినిమా కోసం 80 కోట్లు తీసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ రెండు వారాలలో రవితేజ మాస్ చేతుల కోసం డబ్బులు కట్టాలి.


హరిహర వీరమల్లు విడుదలైన వారానికే కింగ్డమ్ వస్తోంది. సితార సంస్థకు రెగ్యులర్ బయ్యర్లు ఉంటారు కనుక డబ్బులు కట్టేస్తారు. కానీ ఆ సినిమా రెండు వారాలలో గట్టిగా వసూలు చేయాలి. ఎందుకంటే అదే బయ్యర్లు వార్‌ 2 సినిమాకి డబ్బులు కట్టాలి. కింగ్డమ్ వసూళ్లు .. అదనపు పెట్టుబడి కలిపితే వార్ 2కి చెల్లింపులు జరుగుతాయి. వార్ 2 సినిమాకి పోటీగా కూలి ఉంది. అందువల్ల థియేటర్లు చీలిపోతాయి. గట్టి పోటీ ఉండడంతో బయ్యర్లు అనుకున్న స్థాయిలో అడ్వాన్సులు ఇస్తారా లేదా ? అన్నది సందేహం ఉంది. హరిహర వీరమల్లు సినిమా నుంచి విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాకు గట్టి పోటీ ఉంది. అటు వార్ 2 సినిమాకి కూలి సినిమా పోటీ ఉంది. మాస్ జాతర వచ్చిన వారానికి అనుష్క ఘాటీ - గర్ల్ ఫ్రెండ్ సినిమాలు రాబోతున్నాయి. ఇలా గట్టి పోటీ మధ్యలో నెల రోజుల్లో మూడు సినిమాలు రిలీజ్ చేయటం అంటే నాగవంశీ గేమ్ మామూలుగా లేదని చెప్పాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: