రాజమౌళితో సినిమా అంటే చాలా చాలా కష్టమని అందరికి తెలిసిందే.  ఆయనతో వర్క్ చేసిన  ప్రతి ఒక్కరు ఈ మాట  చెబుతూనే ఉంటారు.  ఆయన సినిమా కధని పర్ఫెక్ట్ గా రాసుకుంటారు అని..  అంతే పర్ఫెక్ట్గా తెరకెక్కించాలి అని చూస్తూ ఉంటారు అని .. ఆ కారణంగానే రాజమౌళితో వర్క్ చేయడానికి కొంతమంది నటీనటులు ఇబ్బంది పడుతూ ఉంటారు అని జనాలు కూడా అభిప్రాయపడుతూ ఉంటారు.  జక్కన్న పని  పిచ్చోడు అంటూ ట్యాగ్ చేయించుకునే రాజమౌళి ప్రెసెంట్ మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్నాడు . ఈ సినిమా కోసం ఆయన కొత్త రకమైన టెక్నాలజీని కూడా వాడుతున్నారు . మరీ ముఖ్యంగా  ఈ సినిమా మహేష్ బాబు కెరియర్ లోనే గుర్తుండిపోయేలా చాలా చాలా స్పెషల్ సర్ ప్రైజ్లు కూడా ఉన్నాయి అంటూ బయటికి వచ్చింది.


అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ఈ సినిమా కంప్లీట్ అయ్యేవరకు మహేష్ బాబుని ఒక పని చేయనే చేయకూడదు అంటూ కండిషన్ పెట్టారట రాజమౌళి . అది కూడా డైట్ కి సంబంధించి.  ఆల్రెడీ మహేష్ బాబు పర్ఫెక్ట్ డైట్ ఫాలో అవుతాడు . కానీ ఈసారి ఇంకా పర్ఫెక్ట్ గా డైట్ ప్లాన్ చేయిస్తూ ఫిజికల్ యాక్టివిటీస్ అలాగే వ్యాయామాలు ఎక్కువగా చేసేలా ఫోకస్ చేయిస్తున్నాడట రాజమౌళి. రాజమౌళితో తెరకెక్కించే సినిమా షూట్ కంప్లీట్ అయ్యేవరకు మహేష్ బాబు ఎట్టి పరిస్థితుల్లోనూ షుగర్ ఐటమ్స్ తీసుకోనే తీసుకోకూడదట.  ముందు నుంచి కూడా మహేష్ బాబు స్వీట్స్ ని పెద్దగా లైక్ చేయరు.  కానీ అడపాదడప తింటూనే వస్తారు .



అయితే ఈసారి మహేష్ బాబుకి రిక్రూట్ చేసిన డైటీషియన్ చాలా చాలా స్ట్రిక్ అట.  ఫారిన్ డైటీషియన్ అట.  ఆయన చెప్పిన డైట్ నే ఫాలో అవ్వాలట . హాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ కి కూడా ఈ డైట్ షెడ్యూల్ చెప్తూ ఉంటారట . ఆ డైట్ షెడ్యూల్ ప్రకారం మహేష్ బాబు ఫాలో అవ్వాల్సి ఉంటుంది . కేవలం ఒకటి రెండు రోజు కాదు రాజమౌళి తెరకెక్కే సినిమా ఎన్ని సంవత్సరాలు షూటింగ్ జరిగితే అన్ని సంవత్సరాలు రాజమౌళి అపాయింట్ చేసిన డైటీషియన్ చెప్పిన డైట్ ని మహేష్ బాబు ఫాలో అవ్వాలి . ఎట్టి పరిస్థితిలో విడిచి పెట్టుకోకూడదు. చ్హిట్ మీల్ కూడా లేదు. ఇది వెరీ టఫ్ జాబ్. దీని గురించే ప్రెసెంట్ జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: