ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో రెండు రోజుల్లో హరిహర వీరమల్లు మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ హిస్టారికల్ ఫిల్మ్ వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ధర్మస్థాపన కోసం యోధులు చేసే పోరాటమే ఈ చిత్రం. 1684 లో వీరమల్లు స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఏర్ప‌డ్డాయి. ప్రచార కార్యక్రమాలతో మేకర్స్ మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు.


అయితే హరి హర వీరమల్లు సినిమా సక్సెస్ కావాలని.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బిగ్ హిట్ పడాలని తాజాగా తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. జనసైనికులతో కలిసి సోమవారం సాయంత్రం అలిపిరి పాదాల వద్ద కొబ్బరికాయలు కొట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించారు. వీరమల్లు చిత్రం విజయవంతం కావాలని ఆరణి శ్రీనివాసులు పూజలు చేసి పవన్ పట్ల తనకున్న రియల్ ఫ్యానిజాన్ని బయటపెట్టారు.
అలాగే ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. జూలై 24న విడుదల కానున్న హరిహర వీరమల్లు చిత్రం ప్రజలకు మంచి మెసేజ్ ఇస్తుందని.. అంద‌రూ త‌ప్ప‌కుండా చూడాల‌ని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు. కాగా, క్రిష్‌, జ్యోతికృష్ణ డైరెక్ట్ చేసిన‌ వీర‌మ‌ల్లు చిత్రంలో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టించింది. బాబీ డియోల్, అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల‌ను పోషించ‌గా.. కీర‌వాణి సంగీతం అందించారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: