ప్రభాస్ ని ఎంతమంది జనాలు ఇష్టపడుతుంటారు అనే దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.  ప్రభాస్ అంటే అందరికీ ఒక ఫ్రెండ్ లాంటివాడు.  ప్రభాస్ ని అలానే ట్రీట్ చేస్తూ ఉంటారు . అభిమానులు కూడా ఆయనని ఎక్కువుగా ఇష్ట్పడుతూ ఉంటాడు. పెద్దగా అందరితో ప్రభాస్ మాట్లాడరు కానీ ఆయన గురించి మాత్రం జనాలు అంతా మాట్లాడుకుంటూ ఉంటారు.  అటువంటి ప్రభాస్ - పవన్ కళ్యాణ్ నటించిన ఒక సాంగ్ ని దాదాపు పదివేల కన్నా  ఎక్కువసార్లు విన్నాడు .ఆ పాట తనకి ది మోస్ట్ ఫేవరెట్ అంటూ పలు ఇంటర్వ్యూలో బయటపెట్టాడు .


ఆ పాట మరేంటో కాదు "జల్సా" సినిమాలోని "చలో రే చలో రే చల్". ఈ పాటలోని అర్థం చాలా చాలా లోతుగా అర్థం చేసుకున్నాడు ప్రభాస్ . "ఈ పాటలోని  లిరిక్స్ అన్నా ..మ్యూజిక్ అన్నా.. తనకు చాలా చాలా ఇష్టమని తాను ఎక్కువగా వినేది ఈ పాటనేనని ..ఇప్పటికీ తాను ఈ పాటను వింటూనే ఉన్నాను" అంటూ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు ప్రభాస్.  పవన్ కళ్యాణ్ - నటన అంటే ప్రభాస్ కి చాలా ఇష్టం. ఈ విషయం ఎన్నో సందర్భాలలో బయటపెట్టారు . మరీ ముఖ్యంగా జల్సా లోని "ఈ చలో రే చలో రే చల్"  పాట ఇంత ఇష్టమా అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు .



ప్రజెంట్ ప్రభాస్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు . త్వరలోనే ప్రభాస్ "సల్లార్2" ని సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు . అదేవిధంగా థియేటర్స్ లో డిసెంబర్ 5 న "రాజా సాబ్" రిలీజ్ కాబోతుంది . ఆ తర్వాత స్పిరిట్ ఆ తర్వాత ఫౌజీ.. ఇలా బ్యాక్ టు బ్యాక్ వరుసహిట్లతో బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి రెడీ అయిపోతున్నాడు హీరో ప్రభాస్.  మరి ముఖ్యంగా స్పిరిట్ తో సంచలనాన్ని సృష్టించడానికి సిద్ధమయ్యాడు అంటూ ప్రభాస్ అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . చూడాలి మరి ప్రభాస్ తన ఫ్యాన్స్ ని ఏ రేంజ్ లో మెప్పిస్తాడు అనేది..!!?

మరింత సమాచారం తెలుసుకోండి: