
అంతకు మించిన రేంజ్ లోనే చేయాలి . కాగా ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ విషయం హైలెట్ గా మారింది . గతంలో హీరోయిన్ త్రిష చేసిన విధంగానే ఇప్పుడు రష్మిక చేస్తూ ఇండస్ట్రీలో పాపులారిటీ సంపాదించుకుంటుంది అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు. త్రిష ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఏ విధంగా సక్సెస్ అయ్యిందో సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అదే విధంగా సక్సెస్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది . మంచి మంచి కథ కంటెంట్ ఉన్న సినిమాలనే చూస్ చేసుకుంటుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో త్రిష సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడానికి కారణం ఆమె టైమింగ్స్ .
షూటింగ్ కి చెప్పిన టైంకి వచ్చేస్తుంది . మిగతా నటీనటులు లేటుగా వచ్చిన సరే త్రిష మాత్రం ముందుగానే అక్కడ ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఉండే వాళ్లతో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ ఉంటుంది . ఎవరికి ఆమె పై కంప్లైంట్స్ ఉండనే ఉండవు . ఆ కారణంగానే త్రిష మంచి మంచి అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్గా మారింది. ఇప్పుడు రష్మిక కూడా అలానే చేస్తుంది. బిజీ కాల్ షెడ్యూల్స్ ఉన్నా కూడా ప్రతి సినిమాకి చెప్పిన సమయానికి షూటింగ్ స్పాట్ కు వచ్చేస్తుంది . పైగా రష్మిక అందరితో ఎంత చనువుగా ఉంటుంది అనేది ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . అప్పుడు త్రిష చేసిన విధంగానే ఇప్పుడు రష్మిక చేసి సక్సెస్ అవుతుంది. కొందరేమో వీళ్ళకి ఇండస్ట్రీలో ఉండే కిటుకులు బాగా తెలుసు అని వీళ్లు ఎలాగైనా నెట్టుకు వచ్చేస్తారు బ్రతక నేర్చిన బిడ్డలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!