బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కిన వార్2 సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్లలో విడుదల కానుండగా ఈ సినిమాపై ఆశించిన స్థాయిలో అంచనాలు ఏర్పడలేదు. బాలీవుడ్ టాలీవుడ్ స్టార్ హీరోల ముల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా ముంబై బుకింగ్స్ విషయంలో తీవ్రస్థాయిలో నిరాశపరచగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బుకింగ్స్ ఏ స్థాయిలో ఉండనున్నాయో చూడాల్సి ఉంది.

అయితే మౌత్ టాక్ మాత్రమే ఈ సినిమాకు మిగిలిన ఏకైక హోప్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యశ్  రాజ్ ఫిలిమ్స్ మేకర్స్ సైతం ప్రస్తుత పరిస్థితుల్లో మౌత్ టాక్ పై ఆధారపడటం మాత్రమే చివరి ఆప్షన్ అయింది. ఈ ఏడాది సక్సెస్ సాధించిన కుబేర లాంటి సినిమాల విజయంలో మౌత్ టాక్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. వార్2 మూవీ విషయంలో సైతం అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందో లేదో చూడాలి.

జూనియర్ ఎన్టీఆర్ కాన్ఫిడెన్స్ చూస్తే  మాత్రం వార్2 మూవీ తారక్ గత సినిమాలను మించి ఉండబోతుందని అర్థమవుతోంది.  సినిమాలను, వాటి ఫలితాలను పర్ఫెక్ట్ గా జడ్జ్ చేసే ప్రతిభ తారక్ కు ఉండగా వార్2 విషయంలో సైతం తారక్ నమ్మకం నిజం అవుతుందేమో చూడాల్సి ఉంది.  వార్2 సినిమా బడ్జెట్ కూలీ కంటే ఎక్కువని దాదాపుగా 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది.

నైజాం  ఏరియాలో అటు కూలీ ఇటు వార్2 సినిమాలను దిల్ రాజు రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో థియేటర్ల విషయంలో అయితే ఇబ్బందులు లేవని తెలుస్తోంది.  వార్2, కూలీ సినిమాలలో ఏ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఆ సినిమాకు సంబంధించి స్క్రీన్లు  ఆటోమేటిక్ గా పెరిగే అవకాశాలు ఉంటాయి.  వార్2 మూవీ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ నమ్మకం నిజమవుతుందో లేదో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: