
ఈ ఇంటర్వ్యూలో ఎన్నో పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకున్నారు. ఆ విషయాలను మరొకసారి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్ . ఈ ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడుతూ.." సాధారణంగా అందరూ కూడా భోజనం చేసేటప్పుడు పెరుగును లాస్ట్ లో తింటారు . కానీ నాకు ముందు నుంచి పెరుగన్నం ముందు తినడం అలవాటు. పెళ్లి తర్వాత ఇంటికి వచ్చాక అందరం కూర్చుని లంచ్ చేస్తున్న మూమెంట్లో నేను ఫస్ట్ పెరుగు వేసుకుని తినడం స్టార్ట్ చేశాను . డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ నన్ను విచిత్రంగా చూసారు. అలాగే చూస్తూ ఉండిపోయారు .
ఆ తర్వాత మా మామయ్య గారు చెప్పారు. మందు పప్పు వేసుకుని తినాలి .. ఆ తర్వాత కర్రీ వేసుకొని తినాలి .. ఆ తర్వాత పచ్చడి ..ఆ తర్వాత రసం .. లాస్ట్ లో పెరుగు తినాలి. అదే హెల్త్ కు మంచిది అంటూ మావయ్య వివరించారు . అప్పటినుంచి అలాగే చేస్తూ వచ్చాను. ఆ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను " అంటూ ఉపాసన తన పర్సనల్ విషయాన్నీ అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్. కాగా రామ్ చరణ్ కంటే వయసులో ఉపాసన పెద్దది . ఈ విషయాన్ని ఆమె పెళ్లి టైంలో బాగా ట్రోల్ చేశారు జనాలు . కానీ ఆ తర్వాత ఉపాసన ఎంత మంచి మనిషి అని తెలుసుకొని మెల్లమెల్లగా అది మర్చిపోతూ వచ్చారు. ఉపాసన - రామ్ చరణ్ ల అన్యోన్య దాంపత్యానికి జనాలు కూడా ఫిదా అయిపోయారు..!