ప్రతి మనిషి సినిమా చూసేది ఆనందం కోసమే. సినిమా చూస్తూ కాసేపు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాంటి సినిమా కోసం థియేటర్లలోకి వెళ్లి మరీ టికెట్ తీసుకొని ఫ్యామిలీతో పాటు సినిమాలు చూసేవారు ఎంతోమంది ఉంటారు. ఒకప్పుడు సినిమా థియేటర్ లలోకి వస్తుంది అంటే  తప్పకుండా కుటుంబంతో కలిసి వెళ్లేవారు అనేక మంది ఉండేవారు. కానీ ప్రస్తుత కాలంలో ఆ పరిస్థితి మారిపోయిందని చెప్పవచ్చు. సినిమాలన్నీ కమర్షియల్ గా మారిపోయాయి. ముఖ్యంగా సామాన్య జనాలు కుటుంబంతో కలిసి సినిమాకి వెళ్లాలి అంటే తను సంపాదించే దాంట్లో కనీసం 25% ఖర్చు పెట్టాల్సిందే. దీంతో చాలామంది థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడడం మానేశారు. 

మరి ఇలాంటి దారుణ పరిస్థితులు రావడానికి కారకులు ఎవరో  ఆ వివరాలు చూద్దాం..ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలంలో సినిమా అంటే  ఒక కొత్త అనుభూతి. అప్పుడు టీవీలు, సెల్ ఫోన్లు, ఓటీటీలు లాంటివి లేవు.. ఏ సినిమా చూడాలన్నా థియేటర్ కి వెళ్లాల్సిందే.. అప్పుడున్న డబ్బులతోనే కుటుంబమంతా సినిమాకి వెళ్లి వారికి ఇష్టమైన ఫుడ్ తిని ఎంజాయ్ చేసి వచ్చేవారు. కానీ ప్రస్తుత కాలంలో సినిమాకు కుటుంబంతో వెళ్లి ఎంజాయ్ చేయడం అంటే బహు కష్టంగా మారిపోయింది. అక్కడికి వెళ్తే జేబు గుల్ల చేసుకోవాల్సిందే. దీనికి ఇన్ డైరెక్ట్ గా ప్రభుత్వాలు, నిర్మాతలే కారణమని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఏదైనా సినిమా వచ్చింది అంటే ప్రభుత్వం కొత్త జీవో తీసుకువచ్చి టికెట్ రేట్లు పెంచుతుంది. సినిమా టికెట్ ధర 500 నుంచి 800 ఉంటే ఒక ఫ్యామిలీతో వెళ్తే పాప్ కార్న్ ఇతర ఖర్చులన్నీ కలుపుకొని మినిమం 2000 నుంచి 3000 వరకు ఖర్చు కావాల్సిందే.. ఓటీటీలో చూడాలంటే కూడా రేట్లు భారీగానే ఉన్నాయి. ఈ ఖర్చులన్నీ భరించలేక జనాలంతా పైరసీ వైపు మొగ్గు చూపుతున్నారని  అభిమానులు చెప్పుకొస్తున్నారు.. పైరసీ  సినిమా చూడడం నేరమే అయినా సాధారణ ప్రజలకు అందుబాటులో ధరలు ఉంచకపోవడం వల్లే ఇలా జరుగుతోందని తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: