
ఆమె తొలి ప్రేమ ఒక విదేశీయుడితో. ఇద్దరి మధ్య బలమైన అనుబంధం ఏర్పడి, అది పెళ్లి దిశగా వెళ్లింది. తండ్రి కూడా ఆ సంబంధానికి అంగీకారం తెలిపాడు. ఆ తర్వాత బ్రేకప్ అయ్యింది. ఆమె మళ్లీ ప్రేమలో పడి, ఈసారి స్వదేశీయుడితో ప్రయాణం మొదలుపెట్టింది. రెండవ ప్రేమ ఎక్కువ కాలం నిలవకపోయినా, తొలి అనుభవంతో ఈసారి తాను మానసికంగా గాయపడకుండా ముందుకు సాగింది. దాంతో, సంబంధం ముగిసిన వెంటనే కెరీర్‌పై దృష్టి పెట్టి, వరుస ప్రాజెక్టులతో బిజీ అయ్యింది.
తాజాగా, ఈ నటి మూడోసారి ప్రేమలో పడిందని సమాచారం వెలువడింది. అయితే ఈసారి ప్రేమించిన వ్యక్తి బ్యాచిలర్ కాదు. ఇప్పటికే పెళ్లయి, ఇద్దరు పిల్లలున్న అగ్ర దర్శకుడితో ప్రేమలో పడ్డట్లు తెలిసింది. ఆ దర్శకుడు గత కొంత కాలంగా అగ్రహీరోలతో మాత్రమే భారీ సినిమాలు చేస్తూ, టాప్ డైరెక్టర్‌గా ఉన్నాడు. ఇద్దరూ గతంలో కలిసి పనిచేసిన అనుభవం ఉండటంతో, ఈమె అతనితో సన్నిహితంగా మెలిగింది. ఆ చనువు కారణంగానే తన మనసులో మాటను బెణుకు లేకుండా అతనికి చెప్పేసింది.
కానీ, ఆ దర్శకుడు ఆమె ప్రేమను అంగీకరించలేదు. సున్నితంగా తిరస్కరిస్తూ, “నాకు ఇప్పటికే పెళ్లయింది, ఇద్దరు పిల్లలు ఉన్నారు” అని క్లాస్ పీకాడట. ఆ ఆన్సర్‌తో ఆ హీరోయిన్ డిజప్పాయింట్ అయినా ఆ డైరెక్టర్‌తో స్నేహాన్ని అలాగే కొనసాగిస్తోందట. ప్రస్తుతం వీరిద్దరూ చేస్తున్న సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.