సీనియర్ ఎన్టీఆర్ నట, రాజకీయ జీవితాన్ని పుణికిపుచ్చుకున్న ఏకైక  వారసుడు నందమూరి బాలకృష్ణ అని చెప్పుకోవచ్చు.. ఎందుకంటే సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయ సాధన కోసం ముందుకు వెళుతున్నారు. ఇలాంటి బాలకృష్ణ  ఏం మాట్లాడినా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతారు. బయట ఒకటి, ముఖం ముందు మరొకటి చెప్పరు. ఏదైనా ముక్కుసూటిగా చెప్పే తత్వం బాలకృష్ణది. ప్రస్తుతం ఆయన హిందూపూర్ లో మూడవసారి ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించారు. అలాంటి బాలకృష్ణ తాజాగా చేసిన కామెంట్స్  వివాదాస్పదంగా మారాయి. ఆయన తుళ్లూరులో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల గురించి మండిపడ్డారు.. 

గత ప్రభుత్వం పూర్తిగా రాష్ట్రాన్ని దివాళా తీయించిందని, ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పుకొచ్చారు. అయినా ఈ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసం కృషి చేస్తుందని, చాలా వరకు పథకాలు అమలు చేస్తోందని తెలియజేశారు. అయినా కొంతమంది ప్రభుత్వం పై దుష్ప్రచారం చేస్తున్నారని అలాంటి వారిని పట్టుకుని తలలు తీసేయాలంటూ మాట్లాడారు. ఈ విధంగా తలలు తీసేయ్యాలని అనడంతో అది సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఆయన అమరావతిలో  బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి భూమి పూజ కూడా చేశారు. బసవతారకం అనేది డబ్బులు సంపాదించుకోవడం కోసం పెట్టిన ఆసుపత్రి కాదని ఎంతోమంది పేద ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం పెట్టిన ఆసుపత్రి అని కొనియాడారు.

 ఇందులో చికిత్స తీసుకొని ఎంతో మంది పేదలు హ్యాపీగా జీవిస్తున్నారని తెలియజేశారు. ఇండియాలోని అత్యుత్తమ క్యాన్సర్ ఆసుపత్రుల్లో బసవతారకం ఆసుపత్రి మంచి పేరు సంపాదించుకుందని అన్నారు. ఈ ఆస్పత్రికి ఎన్నో అవార్డులు వచ్చాయని తెలియజేశారు. హైదరాబాదులో ఈ ఆస్పత్రి స్థాపించే సమయంలో ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నామని, అయినా ఆస్పత్రి స్థాపించి పేద ప్రజలకు చికిత్స అందిస్తున్నామని తెలియజేశారు. అలాగే అమరావతిలో కూడా పేదలకు ఉచిత చికిత్స అందించడం కోసం ఆస్పత్రి  త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: