సాధారణంగా ఎవరైనా తప్పు చేస్తే, ఆ తప్పును మనం చేయకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకుంటాం. ఇది ఏ రంగంలోనైనా సరే అలాగే ఉంటుంది. ఒక మార్గంలో వెళ్తుంటే, ఆ మార్గంలో వెళ్లి ఇప్పటికే కొంతమంది బొక్కబోర్లపడి ఉంటే, మిగతా జనాలు ఆ మార్గంలో వెళ్లడానికి ఆసక్తి చూపరు. ఆ భయం ఉంటుంది. కానీ కొంతమంది మాత్రం మూర్ఖంగా ఆ వైపే వెళ్తామని చెప్పి, వెళ్లి సమస్యలను కొనితెచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇదే విధంగా మాట్లాడుకుంటున్నారు జనాలు. ఇప్పటికే మన తెలుగు హీరోలు బాలీవుడ్‌కి వెళ్లి అక్కడ నెగిటివిటీని ఎదుర్కొని, ఫ్లాప్స్ తమ ఖాతాలో వేసుకున్నప్పుడు మరొక హీరో ఎందుకు బాలీవుడ్‌లోకి వెళ్లాడు? .. అనేది ఇప్పుడు తెలుగు జనాల ప్రశ్న.


దానికి కారణం రీసెంట్‌గా విడుదలైన "వార్ 2". జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ బాలీవుడ్ ఫిల్మ్ బాలీవుడ్‌లో హిట్ అయినా, టాలీవుడ్‌లో మాత్రం అనుకున్నంత స్థాయి రీచ్ సాధించలేకపోయింది. అయితే, ఇప్పుడు తారక్ సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్‌కి గురవుతున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ "జంజీర్" సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వెళ్లాడు.  కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత తెలుగులో మళ్లీ నిలదొక్కుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇక ప్రభాస్ కూడా బాలీవుడ్‌లోకి వెళ్లి వరుస ఫ్లాప్స్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికీ ప్రభాస్ హిట్స్ సాధించడానికి చాలా కష్టపడుతున్నారు.



ఈ ఇద్దరిని చూసినా తారక్ జాగ్రత్తపడకుండా ఎందుకు డైరెక్ట్‌గా బాలీవుడ్ ఫిల్మ్ చేశాడు?  అనేది అభిమానుల ప్రశ్న. దీనికి ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. అంతేకాదు, ఇప్పటికే ఇద్దరు హీరోలు బాలీవుడ్‌లో ఫ్లాప్స్ మూటగట్టుకున్నప్పుడు, మరొక హీరో ఎందుకు వెళ్లాడు?  అంటూ చర్చ జరుగుతోంది. కనీసం ఈ ముగ్గురు హీరోలను చూసైనా, తరువాత బాలీవుడ్‌కి వెళ్లాలని అనుకునే హీరోలు జాగ్రత్త పడితే మంచిదని అభిమానులు సలహా ఇస్తున్నారు. అయితే, తరువాత బాలీవుడ్‌లోకి ఎవరు వెళ్తారు? — అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం, ఇప్పటికే బాలీవుడ్ డైరెక్టర్‌తో అల్లు అర్జున్ ఒక సినిమాకి కమిట్ అయినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ అది నిజమైతే, ఈ లిస్టులో తరువాత చేరబోయేది బన్నీయే అవుతాడని కొంతమంది అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: