
నటి శ్వేతా మీనన్ తన ప్రత్యర్థి అయిన దేవన్ ను ఓడించి మరి అమ్మ ప్రెసిడెంటు పదవిని దక్కించుకుంది. అలాగే నటి శ్వేతతో పాటుగా ఇందులో చాలామంది కీలకమైన పదవులు చేపట్టబోతున్నారు. జనరల్ సెక్రటరీగా కుక్కు పరమేశ్వరన్, జాయింట్ సెక్రెటరీ అన్సీబా హాసన్ , లక్ష్మీ ప్రియ ఎన్నిక కావడం జరిగింది. గతంలో అమ్మ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా హీరో మోహన్ లాల్ బాధ్యతలు తీసుకున్నప్పటికీ కానీ గత ఏడాది ఇండస్ట్రీలో ఎక్కువగా లైంగిక వేధింపులు ఆరోపణలు నేపథ్యంలో అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
అయితే 2027లో జరగాల్సిన ఈ అమ్మ ఎన్నికలు అనూహ్యంగా ఈ ఏడాది నిర్వహించారు. ఇలాంటి సమయంలోనే నటి శ్వేతా మీనన్ పైన ఒక కేసు కూడా నమోదు అవ్వగా అయితే ఈ ఎన్నికలలో ఆమె గెలుస్తుందా? లేదా అనే ఉత్కంఠమైన పరిస్థితులలో గెలవడం జరిగింది. ముఖ్యంగా ఆమెను నటించిన బోల్డ్ సినిమాలు విషయం పైన పాత కేసులు కూడా ఉన్నట్టుగా ఆరోపణలు వినిపించాయి. ఇక అమ్మ ప్రెసిడెంటుగా గెలిచిన తర్వాత మొదటిసారి శ్వేతా మీనన్ మాట్లాడుతూ.. మీరందరూ కూడా అమ్మ సంస్థలో ఒక మహిళగా ఉండాలని చెప్పారు.. అది ఈరోజు నుంచి మొదలయ్యింది అంటూ తెలియజేసింది. గతంలో విభేదాల కారణంగా సంఘం నుంచి వెళ్లిపోయిన చాలా మంది సభ్యులను తిరిగి ఆహ్వానిస్తానంటూ అందరం కలిసి పనిచేద్దామంటూ తెలిపింది. శ్వేతా మీనన్ రతినిర్వేదం తదితర చిత్రలలో నటించింది.