రీసెంట్‌గా విడుదలైన మచ్ అవైటెడ్ ఫిలిం వార్ 2. ఈ సినిమా పై జనాలు ఎన్ని ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారో అన్నది అందరికి తెలుసు.  హృతిక్ రోషన్–జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ మూవీ అభిమానులని ఫుల్ సాటిస్ఫై చేసింది. ఈ సినిమాను అయాన్ ముఖర్జీ తనదైన స్టైల్‌లో తెరకెక్కించారి.  ప్రేక్షకులకు ఇది బాగా ఎంటర్ టైన్మెంట్  అందించింది. ఈ సాలిడ్ ప్రాజెక్ట్ ఆగస్టు 14వ తేదీన విడుదలై మంచి పాజిటివ్ టాక్‌ను అందుకుంది. యాక్షన్ సీన్స్ కి ప్రత్యేకమైన ప్రశంసలు దక్కుతున్నాయి.


హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్‌ల పర్ఫార్మెన్స్‌కు మంచి రివ్యూలు వస్తున్నాయి. ముఖ్యంగా హిందీలో ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. వార్ 2 వర్కింగ్ డేస్‌లోనే సెన్సేషనల్ రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు వరుస హాలిడే లు కారణంగా కలెక్షన్లు భారీగా పెరిగాయి. ఏకంగా 55% జంప్ నమోదైందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. డే2కి గాను సుమారు 47 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టినట్లు టాక్ వినిపిస్తుంది. ఈ హాలిడే ఎఫెక్ట్ వల్లే ఇలా సాధ్యమైందని చెబుతున్నారు. మొత్తానికి వార్ 2 కొంత పాజిటివ్, కొంత నెగిటివ్ టాక్ ఉన్నా బాక్సాఫీస్ రికార్డులను బ్లాక్ చేస్తూ దూసుకుపోతోంది. ఈ చిత్రానికి బాలీవుడ్ స్టార్స్ కూడా మంచి రివ్యూలు ఇచ్చారు. ముఖ్యంగా తెలుగు హీరో జూనియర్ ఎన్టీఆర్ నటన, డాన్స్, స్టైల్, డైలాగ్ డెలివరీని విపరీతంగా ప్రశంసిస్తున్నారు. ఈ రేంజ్ ప్రశంసలు తారక్ అభిమానులు ఎక్స్ పెక్ట్ చేయలేకపోయారు.


ఇక బాలీవుడ్‌లో జూనియర్ ఎన్టీఆర్ సోలో ఫిల్మ్ చేయబోతున్నాడన్న వార్త కూడా బయటకు వచ్చింది. అయితే ఇది అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్ ఎవరు? హీరోయిన్ ఎవరు? కాన్సెప్ట్ ఏంటి? అనేది తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: