టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో ఒకరైన మృణాల్ ఠాకూర్ సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకోగా ఫ్యామిలీ స్టార్ సినిమా నిరాశ పరిచిన నేపథ్యంలో ఈ బ్యూటీకి ఆఫర్లు తగ్గాయి. మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం డెకాయిట్ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా ఫలితం మృణాల్ కు కీలకం కానుంది. అయితే ఈ మధ్య కాలంలో మృణాల్ ఠాకూర్ పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఈ బ్యూటీ సక్సెస్ గురించి కీలక వ్యాఖ్యలు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.  సినిమా ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించాం అనేది మనకు ముఖ్యం  కాదని మృణాల్ వెల్లడించారు.  ఆ సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టారనేది కూడా నాకు ముఖ్యం కాదని మృణాల్ ఠాకూర్ పేర్కొన్నారు.  సినిమాలో నేను అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చానా లేదా అనేది నాకు ముఖ్యమని ఆమె తెలిపారు.

ఒక సినిమాలో అద్భుతంగా నటిస్తే సినిమా ఫలితం ఎలా ఉన్నా నా దృష్టిలో ఆ సినిమా సక్సెస్ సాధించినట్టేనని ఆమె  అభిప్రాయపడ్డారు.  డబ్బుతోనే సక్సెస్ ను కొలిస్తే ఆ సక్సెస్ ఎప్పటికప్పుడు మారిపోతుందని మృణాల్  ఠాకూర్ అభిప్రాయపడ్డారు. సక్సెస్ ను మనసుతో చూడాలని ఆమె కామెంట్లు చేశారు.

నేను బాగా నటించలేదనే రిమార్క్ రాకుండా కెరీర్ కొనసాగితే చాలని ఆమె వెల్లడించారు.  భరించలేకపోతున్నాం బాబోయ్ అని ప్రేక్షకులకు అనిపిస్తే మాత్రం తాను ఫెయిల్ అయినట్టేనని ఆమె వెల్లడించారు. మృణాల్ ఠాకూర్ పారితోషికం ఒకింత భారీ స్థాయిలోనే ఉంది. మృణాల్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: