ఏంటి పీకలదాకా తాగి జగపతిబాబు ఆ హీరోతో గొడవ పెట్టుకున్నారా.. ఇంతకీ జగపతిబాబు గొడవ పెట్టుకున్న ఆ హీరో ఎవరు? ఎందుకు జగపతిబాబు అలా ప్రవర్తించారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. హీరో గానే కాకుండా విలన్ గా కూడా తన సత్తా ఏంటో నిరూపించారు జగపతి బాబు. అయితే అలాంటి ఈ నటుడు తాజాగా హోస్ట్ గా కూడా అవతారమెత్తారు. అలా జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న మొదటి షో జయమ్ము నిశ్చయమ్మురా.. ఆ షోకు ఫస్ట్ గెస్ట్ గా తన స్నేహితుడు అయినటువంటి నాగార్జునని ఆహ్వానించారు.అలా నాగార్జున జగపతిబాబు మధ్య ఎన్నో ఆసక్తికరమైన ముచ్చట్లతోపాటు ఎమోషనల్ ముచ్చట్లు కూడా బయటపెట్టారు. అలాగే వీళ్ళగురించి తెలియని కొన్ని సీక్రెట్లు కూడా బయట పెట్టుకున్నారు. 

ఇందులో భాగంగా ఈ షోకు సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ ఆగస్టు 17 అనగా ఈరోజు రాత్రి 9 గంటలకు రాబోతోంది. కానీ దీనికి సంబంధించిన ప్రోమోలు ఒక్కొక్కటిగా వదులుతూనే ఉన్నారు ఈ షో యాజమాన్యం.అలా తాజాగా వైరల్ అవుతున్న ప్రోమోలో జగపతిబాబు ఫుల్లుగా తాగి నాగార్జున గొడవ పెట్టుకున్న విషయం బయటపడింది. అయితే జగపతిబాబు నాగార్జున ని నువ్వు నా గురించి ఆరోజు తప్పుగా చెప్పావంట కదా..గోవాలో వేరే డేట్ కి వెళ్లి ఉంటాడని అంటూ ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నకి నాగార్జున మాట్లాడుతూ.. ఒకసారి సరిగ్గా గుర్తు తెచ్చుకో.నేను కాదు ఆ మాట మాట్లాడింది నువ్వే అని చెప్పారు.ఆ తర్వాత జగపతిబాబు మనిద్దరం ఓసారి ఫుల్లుగా తాగాం..

ఆరోజు నీకు నాకు మధ్య గొడవ జరిగింది.ఇక గొడవ తర్వాత నువ్వు నన్ను మీ ఇంట్లో ఫంక్షన్లకు పిలవడం మానేశావు.అందుకే నాగచైతన్య పెళ్లికి నన్ను రమ్మనలేదు.ఎందుకు నన్ను పిలవలేదు అని జగపతిబాబు అడిగారు.ఇక జగ్గూ భాయ్ ప్రశ్నకు నాగార్జున ఏదో హడావిడిగా జరిగిపోయింది. అయినా నేను పిలవకున్నా కూడా నువ్వు వస్తే బాగుండు కదా.. మన బాండింగ్ ఏంటో అందరికీ తెలిసేది అని అన్నాడు.ఇక నువ్వు చైతన్య పెళ్లికి పిలవక పోయినప్పటికీ అఖిల్ పెళ్లికి మాత్రం మొదట నన్నే పిలిచావు సంతోషం అంటూ చెప్పారు. అలా నాగార్జున జగపతిబాబు మధ్య ఉన్న సాన్నిహిత్యం ఏంటి అనేది ఈ షోలో పూర్తిగా బయట పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: